S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 07:36

న్యూఢిల్లీ, జనవరి 18: మరో వారంలో గణతంత్ర వేడుకలు జరుగనున్న దృష్ట్యా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సైనిక దుస్తుల్లో ఏడుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం సృష్టించాయి. దీనితో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించి భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

01/19/2017 - 07:34

అమరావతి, జనవరి 18: తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి తెచ్చి నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఓడించిన మహానాయకుడని అన్నారు.

01/19/2017 - 07:34

అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్శిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ ఆరాంకో సంస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్, సీఈవో అమిన్ హెచ్ నాసర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

01/19/2017 - 07:25

మెల్బోర్న్, జనవరి 18: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గాడు. క్వాలిఫయర్ నొవా రూబిన్‌తో తలపడిన అతను 7-5, 6-3, 7-6 ఆధిక్యంతో విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు.

01/19/2017 - 07:23

సరావక్, జనవరి 18: భారత స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె 21-9, 21-8 తేడాతో థాయిలాండ్‌కు చెందిన చాసినీ కొరెపప్‌పై విజయం సాధించింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇప్పటి వరకూ టైటిల్ సాధించలేకపోయినా ఆమె ఈ టోర్నీలో ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంది.

01/19/2017 - 07:17

న్యూఢిల్లీ, జనవరి 18: ఈఏడాది తీరికలేని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి మొదలయ్యే హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ప్రాక్టీస్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని భారత డిఫెండర్ బీరేంద్ర లాక్రా అన్నాడు. కండరాలు బెణకడంతో రియో ఒలింపిక్స్‌లో ఆడలేకపోయిన అతను ఆతర్వాత కోలుకొని, నిరుడు అక్టోబర్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగాడు.

01/19/2017 - 07:10

చెన్నై, జనవరి 18: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఏ ఒక్క ప్రాంతానికో లేదా దేశానికో పరిమితం చేయడం తగదని ప్రముఖ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్‌మోర్ ప్రశంసించాడు. ఇక్కడి శ్రీరామచంద్ర స్పోర్ట్స్ సైనె్సస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ, అశ్విన్ అందరి వాడని అన్నాడు.

01/19/2017 - 07:09

కటక్, జనవరి 18: పరమిత ఓవర్ల ఫార్మాట్లకు కూడా రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత జరుగుతున్న మొదటి వనే్డ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. మొదటి వనే్డలో ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు 350 పరుగులు సాధించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, మరో సెంచరీ హీరో కేదార్ జాదవ్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి విషయం తెలిసిందే.

01/19/2017 - 07:03

దావోస్, జనవరి 18: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో దక్షిణాసియా దేశాలు కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యుఇఎఫ్)లో పాల్గొన్న ఆమె బుధవారం మాట్లాడుతూ బలమైన ఆర్థిక వృద్ధిరేటు, గణనీయంగా పెరుగుతున్న కొనుగోళ్ల సామర్థ్యంతో దక్షిణాసియా దేశాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయన్నారు.

01/19/2017 - 06:02

ముంబయి, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21.98 పాయింట్లు పెరిగి 27,257.64 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు అందుకుని 8,417 వద్ద నిలిచింది.

Pages