S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 07:54

హైదరాబాద్, జనవరి 18: భూసేకరణకు సంబంధించి 2013 చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలు చెల్లవంటూ ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూల్స్‌ను రూపొందించింది. ‘తెలంగాణ స్టేట్ రైట్ టు ఫెయిర్ కంపెనే్సషన్ రూల్స్, 2014’గా దీన్ని పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తర్వులు (జీఓఎంఎస్ 6) జారీ అయ్యాయి.

01/19/2017 - 07:53

హైదరాబాద్, జనవరి 18: ఆర్థిక నేరాలపై దృష్టి సారించామని, వీటి నియంత్రణకు ఆర్బీఐ, సెబితో కలసి పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కె అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నేరాలు, ఖాతాల రక్షణ, సైబర్ క్రైమ్‌వంటి అంశాలపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో దాదాపు 80మంది పోలీస్, సిఐడి అధికారులు పాల్గొన్నారు.

01/19/2017 - 07:51

హైదరాబాద్, జనవరి 18: శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బుధవారం సభలను నిరవధికంగా వాయిదా వేశారు. గత నెల 16న ఉభయ సభలూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శీతాకాల సమావేశాలు సాధారణంగా వారం పది రోజులకు మించి జరగవు.

01/19/2017 - 07:49

హైదరాబాద్, జనవరి 18: వచ్చే వార్షిక బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. వచ్చే బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు పంపించిందన్నారు.

01/19/2017 - 07:43

జోధ్‌పూర్, జనవరి 18: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టులో పెద్ద ఊరట లభించింది. 18 ఏళ్లనాటి కృష్ణ జింకల వేట ఘటనలో సల్మాన్‌పై మోపిన ఆయుధాల చట్టం కేసులో రాజస్థాన్ కోర్టు ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అతడిపై చేసిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని బుధవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో 102 పేజీల తీర్పును చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ దల్పత్‌సింగ్ చదివి వినిపించారు.

01/19/2017 - 07:42

హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.859 కోట్ల విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపి డిస్కంలు బుధవారం ఏపి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై వచ్చే రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో మండలి బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. ఆ తరువాత మార్చి 31 లోపల పెంపుదలపై నిర్ణయం ప్రకటిస్తాయి.

01/19/2017 - 07:39

విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం, సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాల్లో ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. తాజాగా ప్రస్తుత సిఎస్ టక్కర్ సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం.

01/19/2017 - 07:38

న్యూఢిల్లీ, జనవరి 18: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పార్లమెంట్ స్థారుూ సంఘం సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

01/19/2017 - 07:38

న్యూఢిల్లీ, జనవరి 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యం లో బ్యాంకింగ్ వ్యవస్థలో మామూలు పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయన్న దానిపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోయారు. అయితే రద్దయిన కరెన్సీలో 60శాతం మొత్తాన్ని అంటే 9.2లక్షల కోట్ల మేర కొత్త నోట్లతో భర్తీ చేయగలిగామని తెలిపారు.

01/19/2017 - 08:18

అమరావతి, జనవరి 18: మీ వీధిలో లైట్లు వెలగడం లేదా! అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదా! మీ ఇంటిముందు డ్రైనేజీలో మురికి పేరుకుపోయిందా! మీ ఇంటిముందు రోడ్డు చెత్తకూపంలో ఉందా..! అనుమతిలేకుండా అడ్డదిడ్డంగా భవన నిర్మాణం జరుగుతోందా! ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారా! ఇలా పలు సమస్యలను చూస్తే ఆవేదన, ఆక్రోశం రాక మానదు.. వీటన్నిటికీ ఒకే పరిష్కారం... అదే ‘పురసేవ’ యాప్!

Pages