S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/30/2016 - 04:32

హైదరాబాద్, నవంబర్ 29: ఉగ్రవాదులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు తమ ప్రతిభను మరోసారి చాటారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఆల్‌ఖైదా నెట్‌వర్క్ బేస్ మాడ్యూల్‌కు చెందిన ముగ్గురు అనుమానితులను జాతీయ పరిశోధనాసంస్థ(ఎన్‌ఐఏ) మదురైలో అరెస్టు చేయడానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ అందించిన కీలక సమాచారం బాగా తోడ్పడింది.

11/30/2016 - 04:31

హైదరాబాద్, నవంబర్ 29: జంటనగరాల్లో కోటి మందికి పౌరసేవలు, అత్యవసర సేవలను అందించే జిహెచ్‌ఎంసిలో నగదు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దీకి పూర్తి స్థాయిలో మద్దతునివ్వటంతో పాటు ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు నగదు రహిత సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన వెంటనే కమిషనర్ జనార్దన్ రెడ్డి నగదు రహిత సేవలను ప్రారంభించారు.

11/30/2016 - 04:30

జగిత్యాల, నవంబర్ 29: కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా వ్యాపారం గుట్టు రట్టయింది. ముఠా సభ్యులైన ముగ్గురు వ్యాపారులను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

11/30/2016 - 04:29

జడ్చర్ల, నవంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మాచారం గ్రామంలోని బస్ స్టేజీ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

11/30/2016 - 04:26

సిద్దిపేట, నవంబర్ 29: సిద్దిపేట నియోజకవర్గాన్ని డిసెంబర్ 31వరకు నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా రూపొందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, అధికారులతో 5గంటల పాటు సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు, అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకొని బ్యాంకుల ద్వారా ఆయా శాఖల పరిధిలో, ప్రైవేట్ సంస్థల్లో ఏవిధంగా అభివృద్ధి చేయాలో చర్చించారు.

11/30/2016 - 04:26

విజయవాడ, నవంబర్ 29: తిరుపతిలో రహదారులు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్, వర్సిటీల ప్రాంగణాలు, ముఖ్య కూడళ్లు సుందరీకరించాలి. డిసెంబర్ రెండవ వారంలోగా ఆయా పనులన్నీ పూర్తి చేసి ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సైన్స్ కాంగ్రెస్‌పై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చరిత్రలో నిలిచేలా ఈవెంట్ ఉండాలన్నారు.

11/30/2016 - 04:22

భీమవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించనప్పటికీ అందులోనూ కష్టాలు తప్పేట్టులేదు. ప్రతీ దుకాణంలో స్వైపింగ్ మెషీన్ (ఇ-పోస్) అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరే సూచనలు కనిపించడంలేదు.

11/30/2016 - 04:21

కడప, నవంబర్ 29: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రశే్నలేదన్నారు. కడప జిల్లా పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లెలో జగన్ మంగళవారం పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు.

11/30/2016 - 04:20

నందికొట్కూరు, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత సామాన్యుల ప్రాణాలమీదికి తెస్తోంది. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క విసిగివేశారిన కూలీ ముర్తుజావలీ(40)మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీకి చెందిన ముర్తుజావలి(40) కంకరపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

11/30/2016 - 04:19

రాజమహేంద్రవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మంచి చెడులను ఎంచిచూడటం గత 20 రోజులుగా నిత్యకృత్యం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ పండించిన వరి రైతులపై మాత్రం ఆ ప్రభావం దారుణంగా పడుతోంది. ఒకపక్క దిగుబడులు అతితక్కువగా లభిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు పండిన పంటను అమ్ముకున్నా ఇప్పట్లో నగదు చేతికి వచ్చే అవకాశం లేక అతలాకుతలమవుతున్నారు.

Pages