S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/30/2016 - 07:27

ఎల్‌ఎన్ పేట, నవంబర్ 29: నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం మండలంలోని తురకపేట, దబ్బపాడు గ్రామాల్లో పథకాల అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా చేపట్టి తద్వారా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

11/30/2016 - 07:27

ఒంగోలు,నవంబర్ 29: కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా పెద్దనోట్లను రద్దుచేయటంతో ఇంకా జిల్లావ్యాప్తంగా చిల్లర కష్టాలు తప్పటం లేదు.ప్రధానంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఖాతాదారులు ఉదయం నుండే క్యూలో నిలబడుతున్నప్పటికీ వారికి నగదు అందటం లేదు. జిల్లాలోని అన్ని ఎటిఎంలు, బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

11/30/2016 - 07:24

నెల్లూరుసిటీ, నవంబర్ 29: పాలకుల నిర్లక్ష్యంతో జిల్లావాసుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాజాగా నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఉన్న 150 మెడికల్ అడ్మిషన్లను రద్దు చేస్తూ భారత వైద్యమండలి (ఎంసిఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2014వ సంవత్సరంలో 150 సీట్లతో వైద్య కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

11/30/2016 - 07:22

కర్నూలు, నవంబర్ 29 : ఎలాంటి పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. దర్జాగా ఇంత కాలం వ్యాపారం చేసిన వారు ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో బెంబేలెత్తిపోతున్నారు.

11/30/2016 - 07:20

కొణిజర్ల, నవంబర్ 29: రానున్న రెండేళ్ళలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీరు అందచేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రి మంగళవారం మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.

11/30/2016 - 07:18

గుంటూరు, నవంబర్ 29: నోట్ల రద్దుపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తున్నా సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరటంలేదు.. బతుకుబండిని నడిపే పచ్చనోటు కోసం బ్యాంకుల వద్ద గంటల కొద్దీ బారులుతీరాల్సిన అగత్యం నెలకొంది.. పాత,కొత్త డినామినేషన్లతో బ్యాంకు సిబ్బంది విధుల్లో జాప్యంతో ఖాతాదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది..

11/30/2016 - 07:16

కాకినాడ రూరల్, నవంబర్ 29: కాకినాడ సాగర తీరం శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఈ మంగళాంబికా ఆది కుంభేశ్వరస్వామి 41వ మహాకుంభాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, సముద్ర స్నానాలు ఆచరించుకున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే 108 కన్యలతో పండ్ల రసాల కలశాలతో ఆదికుంభేశ్వరుని అభిషేకం నిర్వహించారు.

11/30/2016 - 07:15

శ్రీ కాళహస్తి, నవంబర్ 29: పంటలు పెట్టడానికి వర్షం లేదు. బావుల్లో, బోర్లల్లో నీళ్లు అడుగంటి పోయాయి. పక్కనే కాలువలో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మను చూసి ఇంతకాలం వేచి చూసిన రైతులు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నారు. తలుపులు పగులగొట్టి తెలుగుగంగ నీటిని తమ చెరువుకు మళ్లించుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తొట్టంబేడుమండలం చిట్టత్తూరు గ్రామం వద్ద జరిగింది.

11/30/2016 - 07:13

వేంపల్లె, నవంబర్ 29: తెలుగుదేశం పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని రాబోయే కాలం మనదే అని వైసీపీ ప్రతిపక్ష నేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు.

11/30/2016 - 07:11

అనంతపురం, నవంబర్ 29 : పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా ఆదాయం తగ్గిపోయింది. నోట్లు రద్దు చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు నష్టం వాటిల్లడంతో ‘పెద్ద’దెబ్బ పడింది. చేతిలో ‘చిల్లర’ నోట్లు ఆడక, కొత్త నోట్లు అవసరమైనన్ని అందని పరిస్థితుల్లో వివిధ రకాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పడిపోయాయి.

Pages