S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/30/2016 - 04:19

గన్నవరం, నవంబర్ 29: కృష్ణా జిల్లా చిక్కవరం శ్రీ బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలోని విగ్రహాల తరలింపునకు నిరసనగా మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు నిరాహారదీక్ష చేపట్టారు.

11/30/2016 - 04:19

గుంటూరు, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి లోగోపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఏడాది క్రితమే ఇందుకు సంబంధించిన డిజైన్లకు రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు ఉత్తమమైన లోగోకు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించింది.

11/30/2016 - 04:18

విజయవాడ, నవంబర్ 29: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఎపి ప్రభుత్వం అన్ని రంగాల్లో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఎపి ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖల్లో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్లు, అక్రమార్జనకు కళ్ళెం పడి అవినీతి తగ్గినట్లు నీతి అయోగ్ ప్రశంసించింది.

11/30/2016 - 04:17

అమరావతి, నవంబర్ 29: ఆయన కీలకమైన విద్యాశాఖకు మంత్రి. అందులోనూ సెట్లపై కసరత్తు జరుగుతున్న సమయం. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? వద్దా? అంత సామర్థ్యం ఉన్న సంస్థలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో మంత్రిగారు మీడియాతో భేటీ అవుతారని సమాచారం వచ్చింది. వచ్చిన అరగంటలోనే మీడియా ప్రతినిధులంతా వెళ్లినా రెండున్నర గంటల వరకూ మంత్రిగారు పత్తాలేరు.

11/30/2016 - 04:17

ఏలూరు, నవంబర్ 29:రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో పర్యటించి, ఆయా కుల సంఘాలు, ప్రతినిధుల నుండి వినతులు స్వీకరించామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె ఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నామని, మరో రెండు నెలల్లో మిగిలిన జిల్లాల పర్యటన పూర్తిచేసి, త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

11/30/2016 - 04:17

అమరావతి, నవంబర్ 29: రాష్ట్రంలో నిరాశా నిస్పృహతో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు, నేతలను కదిలించేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మరో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు బస్సుయాత్ర నిర్వహించిన నాయకత్వం మళ్లీ ఇప్పుడు కూడా రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

11/30/2016 - 04:16

విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం దాదాపు రెండు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉందని, దీనిని పరిష్కరించాలని కోరుతూ సిఎంను కలిసేందుకు నిర్ణయించామన్నారు.

11/30/2016 - 04:16

విజయవాడ, నవంబర్ 29: విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇంజన్ రివర్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను తూర్పు కోస్తా రైల్వే తెరపైకి తెచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు రైల్వే అధికారులు ఉంచారు.

11/30/2016 - 04:15

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: కోదాడ నుండి విజయవాడ వెళుతున్న ఆర్‌టిసి సిఎన్‌జి షటిల్ సర్వీస్ బస్సు మంగళవారం ఉదయం 9గంటల సమయంలో చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో పల్టీ కొట్టింది. చిల్లకల్లు దాటిన తరువాత టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్ కొండయ్యకు ఛాతిలో నొప్పిరావడంతో స్టీరింగ్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకుపోయి టోల్ ప్లాజాకు చెందిన హోర్డింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.

11/30/2016 - 04:15

అనకాపల్లి, నవంబర్ 29: రోజువారీ పొదుపు, నెలవారీ చీటీల పేరుతో అమాయక మహిళలను మోసగించి సుమారు రూ. 3 కోట్లతో ఉడాయించిన దంపతుల ఉదంతమిది. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద పొదుపు స్కీమ్‌లు, చీటీల పేరుతో నెలవారీగా పెద్దమొత్తాలను సేకరించి బకాయిలు చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి దంపతులిద్దరూ ఉడాయించడంతో లబోదిబోమంటూ బాధిత మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

Pages