S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 02:16

టోక్యో, నవంబర్ 22: ఈశాన్య జపాన్ ప్రాంతాన్ని రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో తీవ్ర భూకంపం మంగళవారం కుదిపేసింది. దీని ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల కెరటాలు మీటరుకు పైగా ఎగిసి పడినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటి తీవ్రత ఎక్కువగా లేదని అధికారులు నిర్థారించారు. దాదాపు ఏడు గంటల తర్వాత సునామీ హెచ్చరికల్ని ఉపసంహరించారు.

11/23/2016 - 02:16

న్యూఢిల్లీ, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలయిన పిటిషన్లను డిసెంబర్ 8న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ప్రకటించింది.

11/23/2016 - 02:15

న్యూఢిల్లీ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దు వంటి విధాన నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో కాకుండా వెలుపల ప్రకటించవచ్చా అన్నదానిపై సిపిఎం పార్టీ న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. పార్లమెంటులో కాకుండా సభ వెలుపల ఇలాంటి ప్రకటన చేయడాన్ని పార్టీ తప్పుపడుతోంది. ‘సభ వెలుపల విధాన నిర్ణయం ప్రకటిస్తే దానిపై తరువాత ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాల్సి ఉంటుంది.

11/23/2016 - 02:15

న్యూఢిల్లీ/కాన్పూర్, నవంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద ఇండోర్- పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రైలుకు అదనపు బోగీని జోడించడమే ప్రమాదానికి కారణమైందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా ఈ రైలు 22 బోగీలతో నడుస్తుంది.

11/23/2016 - 02:14

న్యూఢిల్లీ, నవంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదో రోజు మంగళవారం కూడా ఉభయ సభలు సాగలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యలపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. బహిరంగ సభలు, ఎన్నికల సభల్లో పెద్దనోట్ల రద్దు గురించి ఉపన్యాసాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరు కాలేరా? అంటూ రాజ్యసభలో విపక్షాలు నిలదీశాయి.

11/23/2016 - 02:02

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులకు జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు ఎదురైన సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

11/23/2016 - 01:56

విజయవాడ, నవంబర్ 22: మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ బదిలీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన సిఎం, అనుబంధ పరిశ్రమలకు ఉన్న క్వారీలను మాత్రమే బదలాయించేందుకు అనుమతివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న లీజు కాలాన్ని 30 ఏళ్లకు పెంచాలని సూచించారు.

11/23/2016 - 01:55

న్యూఢిల్లీ, నవంబర్ 22: జమ్ము కాశ్మీర్‌లోని మచ్చాల్ ప్రాంతంలో ముగ్గురు సైనికులను చంపి ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికి పాకిస్తాన్ ముష్కరులు తమ పైశాచికత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘాతుకంపై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ సైన్యానికి గట్టి గుణపాఠం నేర్పించేందుకు సిద్ధమవుతోంది.

11/23/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబరు 22: ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా కాపాడలేరా? వాటిని కాపాడాల్సిన బాధ్యత సర్కారుది కాదా? విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరు? అంటూ సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిలదీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వౌలిక సదుపాయాల లేమిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది.

11/23/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబర్ 22: ‘నల్లధనం, అవినీతిపై మనం మొదలుపెట్టిన యుద్ధం ఇప్పట్లో ఆగదు. పెద్ద నోట్ల రద్దు మహాయజ్ఞానికి ఆరంభం మాత్రమే. ముందు ముందు మరిన్ని కఠిన చర్యలున్నాయి. ఇదంతా దేశ ప్రయోజనాల కోసమేనన్న విషయాన్ని మరువకూడదు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంగా చెప్పారు.

Pages