S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 02:51

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్బందులు,శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

11/23/2016 - 02:50

హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పాడైపోయిన రోడ్ల స్థితి, మరమ్మతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)ను ఆదేశించింది. హైదరాబాద్ రోడ్లపై బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకో ర్టు విచారించింది.

11/23/2016 - 02:50

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) వచ్చే నెల 9న నిర్వహించాలనుకున్న రైతు, విద్యార్థి గర్జన వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో బహిరంగ సభ నిర్వహించి వారిని ఇబ్బంది పెట్టరాదన్న ఎఐసిసి సూచన మేరకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

11/23/2016 - 02:33

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలు తమ పట్టును నిలబెట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.

11/23/2016 - 02:27

శ్రీనగర్, నవంబర్ 22: ఏ ఉగ్రవాదులకైతే పెద్దనోట్ల సరఫరాను అడ్డుకోవాలని రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో- ఆ ప్రభుత్వానికే ఉగ్రవాదులు షాక్ ఇచ్చారు. జమ్మూలోని బండీపురా ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయ.

11/23/2016 - 02:26

అల్మోరా, నవంబర్ 22: నల్లధనం దాచుకున్నవాళ్లే పెద్దనోట్ల రద్దుపట్ల భయపడుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అల్మోరాలో మంగళవారం జరిగిన ఓ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇళ్లల్లో నల్లధనం లేనివాళ్లు భయపడటానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? మన నేత ముఖాల్లో ఆందోళనలను మీరు గమనిస్తున్నారా? రాహుల్ బాబా ముఖాన్ని గమనించండి.. ఆయన ఎంత ఆందోళనతో ఉన్నారో కనిపిస్తుంది’’ అన్నారు.

11/23/2016 - 02:23

న్యూఢిల్లీ / కోల్‌కతా, నవంబర్ 22: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు సామాన్య జన జీవనాన్ని కకావికలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో భారీఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించాయి. మరోపక్క వారం పాటు దేశ వ్యాప్తంగా సంయుక్త ఉద్యమం చేపట్టాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.

11/23/2016 - 02:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో పెద్ద నోట్ల రద్దును మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇదే ప్రశ్నను ప్రజలందరినీ అడుగుతున్నారు. నేరుగా తనకే జవాబివ్వాలంటూ అవకాశం ఇస్తున్నారు. ‘నమో’ యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు.

11/23/2016 - 02:19

లక్నో, నవంబర్ 22: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామ్‌నరేష్ యాదవ్ (90) సుదీర్ఘ అస్వస్థత అనంతరం మంగళవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో వ్యాపం కుంభకోణానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనేక మంది అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న వ్యాపం కుంభకోణంలో యాదవ్ పాత్ర అనేక అనుమానాలకు దారితీయడంతో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలైంది.

11/23/2016 - 02:17

న్యూఢిల్లీ, నవంబర్ 22: చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు బూర నరసయ్యగౌడ్ లోక్‌సభలో ప్రతిపాదించేందుకు రాష్టప్రతి ప్రణబ్ ఆమోదం తెలిపారు. నరసయ్యగౌడ్ లోక్‌సభలో ప్రతిపాదించాలనుకుంటున్న చేనేత కార్మికుల సంక్షేమ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం లభించినట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.

Pages