S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 04:13

విజయవాడ (కల్చరల్), నవంబర్ 22: స్వర మాంత్రికుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం మూగవోయింది. ఏకసంతాగ్రాహి అయిన ఆయనను వరించని బిరుదు, అవార్డులు, పురస్కారాలు లేవనే చెప్పుకోవాలి. దాదాపు ఏడు, ఎమినిది సంవత్సరాల వయసులోనే విజయవాడ నగరానికి వచ్చి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వారి వద్ద శిష్యునిగా చేరారు. అప్పటికే ఆయన సంగీత కచేరీలు చేస్తూ బాలగంధర్వునిగా అందరి ప్రశంసలను పొందుతున్నారు.

11/23/2016 - 04:09

చెన్నై, నవంబర్ 22: బాల్యంలోనే మొగ్గ తొడిగిన విద్వత్తు ఆయన. సంగీతం అంటే ఏమిటో తెలియని వయసులోనే రాగం, తానం, పల్లవిని ఆయన ఔపోసన పట్టారు. సంగీతానికి సంబంధించిన సమస్త ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యిగా విశ్వవిఖ్యాతినార్జించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఏ ప్రక్రియ చేపట్టినా స్వరం మాధుర్యం కరతలామలకమయ్యేది.

11/23/2016 - 03:52

గుంటూరు, నవంబర్ 22: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు మార్కెట్ సెంటర్‌లో ఎటిఎం కేంద్రాలను పరిశీలించి, చిరువ్యాపారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకంతో పాటు చిరువ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

11/23/2016 - 03:48

కాకినాడ, నవంబర్ 22: దివీస్ మందుల కంపెనీని ప్రజా నిరసనల మధ్య బలవంతంగా నిర్మించిన పక్షంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని తొలగిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దివీస్ యాజమాన్యం తక్షణం నిర్మాణ పనులు మానుకుని వేరేచోటకు తరలిపోవాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన నిలబడి, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

11/23/2016 - 03:46

కాకినాడ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్యను తీర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం, బ్యాంకులు ఇందుకు ప్రత్యామ్నాయంగా రూపే, డెబిట్ కార్డులను తప్పనిసరిగా వాడాలంటూ ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

11/23/2016 - 03:46

విశాఖపట్నం, నవంబర్ 22: పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కల్పించిన కొన్ని వెసులుబాట్లు అమలుకు నోచుకోవట్లేదు. ఎంత మొత్తాన్నైనా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోవడంతో పాటు, అవసరమైన డిడి, చలానాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ససేమిరా అనడంతో కొన్ని ప్రభుత్వ శాఖల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌పై ఒత్తిడి పెంచుతోంది.

11/23/2016 - 03:45

విజయవాడ, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని రకాల వ్యాపార సంస్థల సంస్థల బోర్డులతోపాటు శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలన్నీ తెలుగులో ఉండేలా చట్టాన్ని తీసుకురావాలంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో నేటికీ శిలాఫలకాలు ఆంగ్ల భాషలోనే సాక్షాత్కరించడం ఎంతో బాధాకరమన్నారు.

11/23/2016 - 03:44

పుట్టపర్తి,నవంబర్ 22: అభివృద్ది చెందిన దేశాల జాబితాలో భారత్ చేరబోతోందని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఆర్.చిదంబరం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

11/23/2016 - 03:41

ప్రత్తిపాడు, నవంబర్ 22: గాంధీ మార్గంలో చేసే సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈమేరకు డిజిపికి మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. మంగళవారం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

11/23/2016 - 03:24

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 7900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ కేంద్రాన్ని కోరనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది.

Pages