S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/24/2016 - 02:13

తిరుపతి, అక్టోబర్ 23: ఈ ఆర్థిక సంవత్సరం నందు వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 1,22,764 ఇళ్లు ఎన్‌టిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 18 నెలల కాలంలోపూర్తి చేసి రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ, చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ తెలిపారు.

10/24/2016 - 02:12

తిరుపతి, అక్టోబర్ 23: గిన్నీస్ బుక్‌లో స్థానం దక్కించుకోవడమే తన లక్ష్యంగా ఈ మారథాన్ రన్‌లో పాల్గొంటున్నానని తమిళనాడు సైదాపేట ఎమ్మెల్యే, మాజీ చెన్నై నగర మేయర్ మా సుబ్రహ్మణ్యం తెలిపారు. మారథాన్ రన్‌లో పాల్గొన్న ఆయన బహుమతి ప్రధానోత్సవ సభలో మాట్లాడుతూ 3 సంవత్సరాల్లో 50 మారథాన్ రన్‌లలో పాల్గొని గిన్సిస్ బుక్‌లో స్థానం దక్కించుకోవడానికి కృషిచేస్తున్నారన్నారు.

10/24/2016 - 02:11

చిత్తూరు, అక్టోబర్ 23: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పాలకులను మనమే ఎన్నుకోవడానికి బలమైన ఆయుధం ఓటు. దీని ద్వారానే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు చట్ట సభల్లో ప్రభుత్వ పథకాలు, చట్టాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించాల్సి ఉంది. ఈ చట్ట సభల్లోని శాసనమండలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యాంగం పట్ట్భద్రులను శాసనమండలికి (ఎమ్మెల్సీ) ఎన్నుకునే అవకాశం విద్యావంతులకే ఇచ్చింది.

10/24/2016 - 02:10

తిరుపతి, అక్టోబర్ 23: సెవన్‌హిల్స్ మారథాన్-2016లో సుమారు 10వేల మందికి పైగా యువతీ యువకులు, మధ్య వయస్కులు వారు పాల్గొన్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో తమవంతు పాత్ర పోషిస్తున్న సుధారాణి ఫౌండేషన్, శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.

10/24/2016 - 02:10

తిరుమల, అక్టోబర్ 23: తిరుమలలో ఆదివారం మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. రెండవ ఘాట్‌రోడ్డులోని వినాయకుని ఆలయం, అలిపిరి వద్ద ఉన్న మొదటి ఘాట్‌రోడ్డు టైం కీపింగ్ కేంద్రం వద్ద అలాగే తిరుమల ఎఎన్‌సి ప్రాంతాలలో వాహన ప్రమాదాలు జరిగాయి. వీటికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన షికారీ చంద్రశేఖర్ దంపతులు వారి ఇద్దరు పిల్లలతోకలిసి ద్విచక్ర వాహనంపై ఉదయం 10.30 గంటలకు తిరుమలకు పయనమయ్యారు.

10/24/2016 - 02:08

తిరుపతి, అక్టోబర్ 23: స్విమ్స్ ఆసుపత్రిలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపైన విచారణ జరిపించాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, ఇతర నాయకులు ఆదివారం తిరుపతిలో డిప్యూటీ సిఎం చినరాజప్పను కలిసి వినతిపత్రం అందజేశారు.

10/24/2016 - 02:08

తిరుపతి, అక్టోబర్ 23: రాష్టవ్య్రాప్తంగా ఎం-్ఫర్మసీ కశాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని గిరిజన విద్యార్థి సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ ఆర్చ్ ఎదుట ధర్నాచేశారు.

10/24/2016 - 02:07

తిరుపతి, అక్టోబర్ 23: పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని టిడిపి సమన్వయకమిటీ తీర్మానించింది. ఆదివారం స్థానిక ఉదరుూ ఇంటర్నేషనల్ హోటల్‌లో ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు గౌనిగారి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

10/24/2016 - 02:05

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 23: 2016-17 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సూచించారు. ఆదివారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా సంక్షేమాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వసతీ గృహాల్లో ఉన్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, వసతీగృహాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

10/24/2016 - 02:05

ఖమ్మం, అక్టోబర్ 23: ఇతర పార్టీల నేతలను తన పార్టీలో చేర్చుకొని అందలమెక్కిన కెసిఆర్ కుటుంబం అవినీతిపరులుగా చరిత్రలో నిలుస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీతక్క అన్నారు.

Pages