S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/24/2016 - 01:08

మచిలీపట్నం, అక్టోబర్ 23: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక రవీంద్ర భారతి హైస్కూల్‌లో ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపి కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

10/24/2016 - 01:08

తోట్లవల్లూరు, అక్టోబర్ 23: లంకల్లో వ్యవసాయ మోటార్లకు సక్రమంగా విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండుతున్నాయని పలువురు రైతులు ఆదివారం సాయంత్రం వల్లూరుపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వల్లూరుపాలెం, తోడేళ్ళదిబ్బలంక రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపిటిసి సభ్యుడు సిహెచ్ గవాస్కర్‌రాజు మద్దతు తెలిపారు.

10/24/2016 - 01:07

పామర్రు, అక్టోబర్ 23: దక్షిణ భారత రాష్ట్రాల్లో మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ సంఖ్యను పూర్తిగా తగ్గించడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సుమారు రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

10/24/2016 - 01:06

అవనిగడ్డ, అక్టోబర్ 23: అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్‌లతో వ్యవసాయం సస్యశ్యామలమైందని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే జిల్లాలో 63 కరవు మండలాలను ప్రకటించటం ఏమిటని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరుగా తేలిందని విమర్శించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

10/24/2016 - 01:06

కలిదిండి, అక్టోబర్ 23: ‘అధికారులు ఒక్క రూపాయి తీసుకుంటే నా మీద ఒట్టు’ అని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో కైకలూరు నియోజకవర్గ స్థాయిలో 1250 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణాలకు రూ.20కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 50వేలు అందిస్తున్నామన్నారు.

10/24/2016 - 01:05

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 23: పట్టణంలో భారీగా సిసిరోడ్ల నిర్మాణాలు చేపట్టామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బిసి సంక్షేమం చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక జైహింద్ హైస్కూల్ ఎదుట రూ.13.20 లక్షలతో నిర్మించే సిసిరోడ్ల పనులను మంత్రి రవీంద్ర ఎంపి కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు.

10/24/2016 - 01:04

గన్నవరం, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు భూములు సేకరిస్తుందని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య ఆరోపించారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల భూమిని సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహతహ లాడుతుందని విమర్శించారు.

10/24/2016 - 01:04

గుడివాడ, అక్టోబర్ 23: బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.10లక్షల రుణం అందిస్తున్నట్టు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈమని సూర్యనారాయణ చెప్పారు. ఆదివారం స్థానిక ఉపద్రష్ట వెంకటశాస్ర్తీ బ్రాహ్మణ సత్రంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. వ్యాపారుల కోసం చాణక్య, గరుడ పథకాలు అమల్లో ఉన్నాయన్నారు.

10/24/2016 - 01:01

విజయవాడ, అక్టోబర్ 23: ఒక పత్రిక, ఛానెల్ ఉంది గదా అని అడ్డగోలు రాతలు రాస్తే ప్రజలు గమనిస్తారని, అలాంటి రాతలు రాసిన ప్రతిపక్ష నేత జగన్ మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

10/24/2016 - 00:56

విజయవాడ, అక్టోబర్ 23: ఆదివారం కావడంతో నగరంలో ఏర్పాటు చేసిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కి జనాదరణ బాగా పెరిగింది. నగరంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు కొత్త అనుభూతిని మిగుల్చుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Pages