S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/24/2016 - 02:04

ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 23: ప్రమాదమని తెలిసినా యుక్త వయసంతా గనిలో గడపి ప్రభుత్వానికి, యాజమాన్యాలకు భారీ లాభాలను గడించి పెట్టి ఉద్యోగవిరమణ చేసిన కోల్‌మైన్ పెన్షన్ దారులకంటే దేశంలోని వృద్ధాప్య పెన్షన్‌దారుల పరిస్థితి ఎంతో నయమని ఆల్‌ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి డిడి రామానందన్ అన్నారు.

10/24/2016 - 02:04

భద్రాచలం, అక్టోబర్ 23: సుందర భద్రాద్రిని యాదాద్రిగా మారుస్తాం.. అణువణువూ అధ్యాత్మిక ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటాం.. భద్రాద్రితో పాటు పర్ణశాల, జఠాయువు ప్రాంతాలకు మరింత గుర్తింపు తెస్తాం.. భద్రాద్రి అభివృద్ధి పనుల కోసం తొలి విడత బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తాం. గత ఏడాది సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సభికుల హర్షధ్వానాల మధ్య భద్రాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పందన ఇది.

10/24/2016 - 02:02

గార్ల, అక్టోబర్ 23: పొంతన లేని విధానాలు, అవకాశ రాజకీయాలతో రాష్ట్రంలో టిఅర్‌ఎస్ పార్టీ పాలన సాగుతుందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితం సత్యం అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజా రంజక పాలన అందిస్తామని కల్లబొల్లి మాటలతో అధికారం చేపట్టిన ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సేవలు శూన్యమన్నారు.

10/24/2016 - 02:01

భద్రాచలం, అక్టోబర్ 23: బానిస రాజకీయాల నుంచి ఆదివాసీ ప్రజాప్రతినిధులు బయటపడాలని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోంది వీరయ్య పిలుపునిచ్చారు. భద్రాచలంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న గిరిజన ప్రాంతాల్లో స్వయం పాలన కోరుతూ సోమవారం నుంచి 100 రోజుల పాటు దండయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

10/24/2016 - 02:01

ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 23: విద్యార్థులను చైతన్యం చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించడం ఎంతో అవసరమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.

10/24/2016 - 02:00

ఎర్రుపాలెం, అక్టోబర్ 23: మండలంలోని రైతు సమస్యలపై ఆదివారం కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైసిపి మరియు రైతుసంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశమైన నాయకులు మండలంలో ప్రకృతి వైపరిత్యాల మూలంగా మరియు నకిలీ విత్తనాల ప్రభావంతో పత్తి, మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారన్నారు.

10/24/2016 - 02:00

గార్ల, అక్టోబర్ 23: ప్రజా సంక్షేమం పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ కోట్లాది రుపాయాల ప్రజా ధనాన్ని అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. మండలం పరిధిలోని మద్దివంచ గ్రామంలో ఆదివారం జరిగిన సిపిఐ గార్ల మండల మహాసభలో అయన మాట్లాడుతూ గారడీ మాటలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారే తప్ప ప్రజలకు చేస్తున్న మేలు శూన్యమన్నారు.

10/24/2016 - 01:58

నెల్లూరు, అక్టోబర్ 23: ఆరుగాలం శ్రమించి సాగు చేసే అన్నదాతలకు పంట చేతికొచ్చే వరకు అన్నీ ఒత్తిల్లే. భయపెట్టే గాలివానలు, చెమట పట్టించే ఎరువుల ధరలు, రుణాల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు ప్రతిక్షణం గండమే. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొన్నా చివరకు గిట్టుబాటు ధర వెక్కిరిస్తోంది.

10/24/2016 - 01:23

కావలి, అక్టోబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానంలో తీసుకొస్తున్న సరికొత్త మార్పులు విద్యారంగాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని, విద్యా ప్రమాణాలు పతనం అవుతున్నాయని ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు.

10/24/2016 - 01:23

సంగం, అక్టోబర్ 23: సంగం బస్టాండు సెంటరులో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కార్లు, ఒక టెంపో దగ్ధమయ్యాయి. వివరాల మేరకు సంగం బస్టాండు సెంటరు వద్ద ఉన్న కారు స్టాండులో రెండు కార్లు, ఒక టెంపో పార్క్ చేశారు. ఆ ప్రాంతం ఎక్కువగా చెత్తా చెదారంతో నిండి ఉండడంతో ఎవరో అగ్గిపుల్ల వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. 8లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు వాహన యజమానులు వాపోయారు.

Pages