S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2016 - 21:57

విశాఖపట్నం, అక్టోబర్ 22: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

10/23/2016 - 21:54

శ్రీకాకుళం, అక్టోబర్ 22: ఆమదాలవలస చక్కెర పరిశ్రమను తెరిపించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి పరిటాల సునీతకు ప్రభుత్వ విప్ రవికుమార్ వినతిపత్రాన్ని శనివారం అందించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సునీతకు నగరంలోని టిడిపి కార్యాలయంలో వినతిపత్రం అందిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి పరిశ్రమను తెరిపిస్తామని స్థానికులకు మాట ఇచ్చారని గుర్తు చేశారు.

10/23/2016 - 21:54

శ్రీకాకుళం, అక్టోబర్ 22: జిల్లాలోని పొందూరు మండల పరిషత్ అభివృద్ధి అదికారి సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ , ఆర్డి కమీషనర్ రామాంజనేయులు ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ నుంచి జెడ్పి సీ ఈవో కు చేరాయి.

10/23/2016 - 21:53

శ్రీకాకుళం, అక్టోబర్ 22: నాసిరకం సరుకులను సరఫరా చేస్తే వారిపై చర్యలు చేపడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి అరసవల్లిలోని పౌర సరఫరాల సంస్థ ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ ఉన్న బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్ సరకులను స్వయంగా పరిశీలించారు.

10/23/2016 - 21:53

శ్రీకాకుళం, అక్టోబర్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్‌లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన ఆయన తొలుత ఇందిరా విజ్ఞాన్ భవన్ నుండి సూర్యమహాల్ కూడలి నుండి ఏడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

10/23/2016 - 21:51

దర్శి,అక్టోబర్ 22:దర్శి పట్టణంలో మినిస్టేడియం నిర్మాణానికి ఐదుకోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శనివారం స్థానిక పార్టీకార్యాలయంలో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

10/23/2016 - 21:50

ఒంగోలు, అక్టోబర్ 22: త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు చోటుదక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన వర్గీయులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

10/23/2016 - 21:48

నెల్లూరు, అక్టోబర్ 22: నగర పరిధిలో కూరగాయల రైతుల కోసం మరికొన్ని రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో కొత్త రైతుబజార్ల ఏర్పాటుపై మార్కెటింగ్, ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు.

10/23/2016 - 21:48

నెల్లూరు, అక్టోబర్ 22: ఎంపి ల్యాడ్స్ నిధుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమర్థవంతంగా, త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో ఎంపి ల్యాడ్స్ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

10/23/2016 - 21:46

నెల్లూరుటౌన్, అక్టోబర్ 22: నగరంలోని పంట కాలువలపై ఉన్న ఇళ్లను కూల్చేవేత సరికాదని, దీనిపై స్థానిక నాయకత్వానికి పూర్తిగా అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు ఆనం వివేకానందరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాలువల్లో పూడికతీత కార్యక్రమం చేపడితే మురుగునీరు, వర్షపునీరు నిల్వ లేకుండా పారుతుందన్నారు. దీనిపై అవగాహన లేక సరైన విధంగా చెప్పడం చేతకాక ఇళ్లు కూల్చివేయాలని చెప్పడం సరికాదన్నారు.

Pages