S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2016 - 21:24

తిరుపతి, అక్టోబర్ 22: పక్షవాతానికి గురైన రోగులను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే చికిత్స సాధ్యమేనని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు. శనివారం స్విమ్స్ న్యూరాలజీ విభాగం విభాగాధిపతి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్వంలో ‘ అక్యూట్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఇన్ విండో పీరియడ్ ’ అనే అంశంపై నిరంతర వైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు.

10/23/2016 - 21:23

కార్తీకమాసము శక్తివంతమైనది. స్నానము, అభిషేకము, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ ఈ మాస విశిష్టతలు. పాపనివృత్తికి మార్గాలు. శతృవులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనము శుభప్రదమైన కార్తీకమాసమని ‘బహులోర్జౌ కార్తీకో’ అనే అమరవాణి సందేశం ద్వారా తెలియజేయబడింది.

10/23/2016 - 21:20

కడప(కల్చరల్), అక్టోబర్ 22: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన డాక్టర్ జానమద్ధి హనుమచ్ఛాస్ర్తీ 1960లో కడప జిల్లాలో కాలుమోపిన ఆయన కడపను స్థిరనివాసం చేసుకున్నారు. నాటినుంచి తన వృత్తికీ, ప్రవృత్తికీ కడప కేంద్రస్థానమయ్యింది. ఐదు దశాబ్దాలుగా కడప జిల్లా సంస్కృతి వికాసానికి దోహదం చేశారు. జానమద్ధి వీధి బడిలో చదివి విలువలు పెంచుకున్నారు. జీవితమంతా రచనావ్యాసంలో తరించిన సాహితీ మూర్తి.

10/23/2016 - 21:19

ప్రాగ్జ్యోతిష్య పురాన్ని ఏలే దానవేశ్వరుడు నరకుడు. ఇతడు బ్రహ్మ వరగర్వి. పూర్వకాలాన సత్యాదేవికి(్భదేవి) పుట్టిన బిడ్డ. కాని ఈ ద్వాపరయుగంలో నరకుడు నరకంటకుడుగా మారాడు. సాధువులను సజ్జనులను హింసించేవాడు. వారినే కాక అబలలైన స్ర్తిలను కూడా సాధించేవాడు. అంతేకాక అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్ని చివరకు మణిమయమైన మేరుశిఖరాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ముల్లోకాలకు ముచ్చెమటలు పట్టించేవాడు.

10/23/2016 - 21:18

కడప(కల్చరల్), అక్టోబర్ 22: ఈనెల 24వ తేది నుంచి 26వ తేది వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు మోటార్ సైకిళ్లతో ఐక్యతయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎపి ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల రాష్ట్ర అద్యక్షుడు కె.చంద్రారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఐక్యతయాత్రకు అసోసియేషన్ రాష్ట్ర ప్రముఖులు మాదాల రమేష్ , శ్యామ్ తదితర నాయకులు హాజరౌతారన్నారు.

10/23/2016 - 21:17

కడప, అక్టోబర్ 22: ల జిల్లాలోని 50 మండలాల్లో 32 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వర్షపాతం నమోదును ప్రామాణికంగా తీసుకుని కరవు మండలాల జాబితాను జిల్లా అధికారులు రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. అయితే ఇటీవల జిల్లా మొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటిస్తామన్న అధికారులు ప్రభుత్వం 32 మండలాలనే కరవుమండలాలుగా ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

10/23/2016 - 21:15

* తెల్లజిల్లేడు మొక్క ప్రాధాన్యాన్ని తెలుపగలరు?
డి. సత్యనారాయణ, క్రిష్ణాపురం

10/23/2016 - 21:13

కడప, అక్టోబర్ 22: చౌకదుకాణాల్లో అక్రమాలు, ఇసుకమాఫియాపై ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడుచౌకదుకాణాల నుంచి అక్రమంగా సరుకు రవాణాకాకుండా, ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టి జిల్లాలోని అధికారపార్టీ నేతలకు సింహస్వప్నంగా నిలిచాడు. అదే ఫార్ములాతో జిల్లాలోని ఎర్రచందనం, ఇసుకమాఫియాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

10/23/2016 - 21:12

‘‘తైలే లక్ష్మీర్జతే గంగా దీపావళి ఆధావసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే’’

10/23/2016 - 21:09

హిందూపురం, అక్టోబర్ 22 : స్థానిక ఆటోనగర్ నుంచి మండల పరిధిలోని కిరికెర బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం బుల్లెట్‌ను నడిపి అటు అభిమానులు, ఇటు కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.

Pages