S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 00:49

ఏలూరు, సెప్టెంబర్ 27: అధికారులు మామాట వినకపోతే ఇక మేమెందుకు, ప్రజాప్రతినిధుల మాట అధికారులు వినేలా ఇన్‌ఛార్జి మంత్రిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఏలూరు ఎంపి మాగంటి బాబు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని కోరారు.

09/28/2016 - 00:48

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని 50 దేవాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా భక్తులకు సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ తెలిపారు. ద్వారకాతిరుమల మాధవ కల్యాణ మండపంలో నిర్వహించిన అసిస్టెంట్ కుక్ భర్తీల నిమిత్తం విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు.

09/28/2016 - 00:48

పెంటపాడు, సెప్టెంబర్ 27: గ్రామంలో ఎక్కడైనా సరే బహిరంగ మల విసర్జన చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పెంటపాడు కాలువ గట్టు పక్కనే స్వచ్ఛ భారత్ నిధులు రూ. 6 లక్షలు, పంచాయతీ నిధులు రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను మంత్రి మాణిక్యాలరావు మంగళవారం ప్రారంభించారు.

09/28/2016 - 00:48

పోలవరం, సెప్టెంబర్ 27: గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరడంతో మంగళవారం ఉదయం నుండి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులలో నుండి నీరు వదలడంతో గోదావరికి వరద పోటెత్తింది. పోలవరంలోని సిడబ్ల్యూసి కార్యాలయం వద్ద గోదావరి నీటి మట్టం 10.14 మీటర్లకు చేరింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రానికి సుమారు 2మీటర్ల నీటి మట్టం పెరిగినట్టు సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు.

09/28/2016 - 00:47

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 27: తల్లాడ - దేవరపల్లి రాష్ట్ర రహదారిలో జంగారెడ్డిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు చిన్న పెద్ద కలిపి 1,870 గోతులు పడ్డాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెంల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు విధి నిర్వహణ కోసం నిత్యం వెళ్ళే ఉద్యోగుల్లో ఒకాయన ఈ గోతులను లెక్కపెట్టారు. గోతుల వివరాలు వెల్లడించారు.

09/28/2016 - 00:46

కామవరపుకోట, సెప్టెంబర్ 27 : ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రద్ధ చూపుతున్నారని, అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రతపై ఏర్పాటుచేసిన అవగాహనా ర్యాలీలో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు.

09/28/2016 - 00:46

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 27: ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా సన్నాహక సభ స్థానిక గమిని ఫంక్షన్ హాలు వద్ద మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండు నుంచి గమిని ఫంక్షన్ హాలు వరకూ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ సెంటరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

09/28/2016 - 00:46

ఉంగుటూరు, సెప్టెంబర్ 27: జాతీయ రహదారిపై బాదంపూడి, ఉంగుటూరు గ్రామాల మధ్య నెల్లూరు వైపు వెళుతున్న కారు పూర్తిగా దగ్థమైన సంఘటన జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో అనపర్తి నుండి నెల్లూరు వెళుతున్న స్కార్ప్యో బాదంపూడి దాటి నాచుగుంట వంతెనకు చేరుతున్న సమయంలో ఇంజన్ నుండి పొగలు ఒక్కసారిగా రావడంతో ఆ వాహనాన్ని ఆపేశారు.

09/28/2016 - 00:45

ఏలూరు, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ సొమ్మును వారం రోజుల్లో వారి ఖాతాలకు జమచేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, చేనేత, జౌళి, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈమొత్తం సుమారు రూ.110 కోట్లు ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో రూ. 65లక్షలతో నిర్మించనున్న చేనేత బజారుకు మంగళవారం మంత్రి శంకుస్ధాపన చేశారు.

09/28/2016 - 00:44

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 27: కార్పొరేషన్‌లో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాలక వర్గంలోని ఇరు వర్గాలు గెలుపుతో 3పైచేయి2 సాధించాలని పోరు సాగిస్తున్నారు. గత ఏడాది ఎం.పి, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి హోరాహోరీ పోరాటం సాగించారు. ఈసారి మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ ప్యానల్స్‌గా ఏర్పడి కమిటీ ఎన్నికల్లో పోటీకి నిలబడటంతో పాలక వర్గంలోని పోరు పతాక స్థాయికి చేరినట్లైంది.

Pages