S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 17:34

చెన్నై: సింగపూర్‌ నుంచి వస్తున్న ఇండిగో విమానం శుక్రవారం చెన్నైలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సామ్‌సంగ్‌ నోట్‌2 ఫోన్‌ పేలడంతో విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు సామ్‌సంగ్‌ సంస్థకు సమన్లు జారీచేశారు. సామ్‌సంగ్‌ నోట్‌ ఫోన్లను అనుమతించొద్దని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీచేసింది.

09/23/2016 - 17:27

దిల్లీ: దేశంలో వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండో రోజూ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై చర్చించారు. ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా ఖరారు చేసినట్లు తెలిపారు.

09/23/2016 - 16:18

కాకినాడ: రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న పౌరసరఫరాలశాఖ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు మండలం పేకేరు గ్రామానికి చెందిన బలరామకృష్ణ బియ్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు వర్క్‌ ఆర్డర్‌ కోసం కొద్దిరోజులుగా రాజ్‌కుమార్‌ను కలుస్తున్నాడు.

09/23/2016 - 16:11

హైదరాబాద్‌: చర్లపల్లి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఫహీం, మాజీ మావోయిస్టు టెక్‌మధును శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి ఈనెల 29వరకు కస్టడీలోకి తీసుకుని, నయీం ఆయుధాల సరఫరాలపై వివరాలు సేకరించనున్నారు.

09/23/2016 - 16:06

హైదరాబాద్‌: శిథిలావస్థలో భవనం ఉన్నందున రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఖాళీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్నిశుక్రవారం పరిశీలించారు. భవనం ఖాళీ చేయాలని పురపాలక శాఖ నోటీసులు జారీచేసింది.

09/23/2016 - 15:19

హైదరాబాద్‌: నగరంలో మూసీనది వరకు వెళ్లే నాలాలకు ఇరువైపులా వెడల్పు చేసి ప్రహారీ గోడ నిర్మించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. భారీవర్షానికి పొంగిపొర్లుతున్న నారాయణగూడ ఆదర్శ్‌ బస్తీ పక్కనే ఉన్న నాలాలను దత్తాత్రేయ శుక్రవారం పరిశీలించారు.

09/23/2016 - 15:12

న్యూయార్క్ః అమెరికాలోని న్యూయార్క్ లాగార్డియా ఎయిర్ పోర్టులో గుర్తు తెలియని వాహనం కలకలం రేపింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతను . భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంతో ఎటువంటి ప్రమాదం లేదని నిర్థారించిన అధికారులు అనంతరం సుమారు గంట తర్వాత ఎయిర్ పోర్ట్ తెరిచేందుకు అనుమతించారు.

09/23/2016 - 15:07

జమ్మూ: భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ సిబ్బంది ఓ పాకిస్తాన్ దేశీయుడిని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పర్గ్వాల్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది భారత్లోకి చొరబడిన వ్యక్తిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని సియాల్కొటె సెక్టార్కు చెందిన అబ్దుల్ ఖయూమ్గా గుర్తించి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.

09/23/2016 - 15:02

ముంబై: పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులు 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన చిత్రపట్ కర్మచారి సేన శుక్రవారం హెచ్చరించించింది. ఉరీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో అల్టిమేటం జారీ చేసింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు. ‘ 48 గంటలు సమయం ఇస్తున్నాం.

09/23/2016 - 14:32

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ ) సమీపంలో ఉగ్రవాదుల కదలికలతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. గురువారం ఇదే ప్రాంతంలో రెండు చొరబాట్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

Pages