S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 08:47

నాచారం, ఆగస్టు 31: భారీ వర్షానికి నాచారం డివిజన్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నాచారం, అంబేద్కర్‌నగర్, ఎర్రకుంట, గాంధినగర్ కాలనీ ఇళ్లలోకి వర్షపునీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎర్రకుంటలో నాలాలు కబ్జాలకు గురై కొద్దిపాటి వర్షానికి మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయని ఎరుకల బస్తీ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.

09/01/2016 - 08:45

సికింద్రాబాద్, ఆగస్టు 31: కుండపోత వర్షంతో నగర జీవనం అతలాకుతలమైంది. సికింద్రాబాద్‌లోని పలు నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ లోతట్టుప్రాంతాలను ముంచెత్తాయి. గల్లీ నుంచి మొదలు రహదారి వరకు రోడ్లన్నీ నిండుకుండలా జలాశయాలను తలపించాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగుల బస్తీలను వాననీరు ముంచెత్తింది. వంటసామాగ్రితోపాటు ఇంట్లోని వస్తుసామాగ్రి వాననీటిలో తడిచిపోయాయి.

09/01/2016 - 08:44

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్రంలో కళారూపాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, గిరిజన్ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. తెలంగాణలో ఎన్నో కళలు మరుగున పడిపోయాని, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాడిన తరువాత కళాకారులకు గుర్తింపు వచ్చిందని, అంతరించిపోతున్న జానపద కళలను వెలికితీసి కళాకారులకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించని మంత్రి పేర్కొన్నారు.

09/01/2016 - 08:43

హైదరాబాద్, ఆగస్టు 31: మహానగరంలో రానున్న మరో 36 గంటల పాటు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు. నగరంలో బుధవారం భారీ వర్షం కురిసి, రామంతాపూర్, భోలక్‌పూర్‌లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన బుధవారం గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు.

09/01/2016 - 08:43

హైదరాబాద్, ఆగస్టు 31: మహానగరాన్ని భారీ వర్షం మరో సారి వణికించింది. గడిచిన నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉక్కపోతకు గురైన నగరం బుధవారం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం ఏడున్నర గంటల నుంచి గంటల తరబడి కురిసిన వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో వర్షం కురవటంతో జనం ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు భయపడ్డారు.

09/01/2016 - 08:41

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 31: పుష్కరాల నిర్వహణలో విజయవాడ నగరం అందరికీ ఆదర్శంగా నిలచిందని, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాల విజయవంతంలో విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగుల పాత్ర నిరుపమానమని, నగర పాలనలోనూ, పౌర సేవల్లోనూ అదే స్ఫూర్తి కొనసాగించాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పేర్కొన్నారు.

09/01/2016 - 08:39

విజయవాడ, ఆగస్టు 31: జిల్లాలో ఆధార్ అనుసంధానంతో ఎరువుల విక్రయాలకు (ఎఇఎఫ్‌డిఎస్) నమోదైన డీలర్లు ఎరువుల అమ్మకాలు చేయకపోతే డీలర్‌షిప్ రద్దు చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ఎన్‌ఐసి, టెక్ విజన్, టాటా ట్రస్ట్ ప్రతినిధులతో ఆధార్ అనేబుల్డ్ ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం సమీక్షా సమావేశం నిర్వహించారు.

09/01/2016 - 08:39

మచిలీపట్నం, ఆగస్టు 31: ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. తన అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. అజెండాలో పొందుపర్చిన 73 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.

09/01/2016 - 08:38

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 31: వరుణుడి కరుణతో పంటకాల్వలు, డ్రైన్లు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం కానున్న తరుణంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగుపై రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ భూములు నీటితో నిండిపోవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరినారుకు బాగా గిరాకీ పెరిగింది.

09/01/2016 - 08:37

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 31: ఉద్యోగ విరమణ చేసిన పోలీసులు సమాజసేవలో పాల్పంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ బివిడి సాగర్ అన్నారు. డిసిఆర్‌బి ఎస్‌ఐ ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్‌బి ఎస్‌ఐ కె వెంకటేశ్వర్లు, ఎఆర్ కానిస్టేబుల్ జెవి రమణ పదవీ విరమణ సన్మాన సభను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సాగర్ వారిని ఘనంగా సత్కరించారు.

Pages