S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 21:03

రజిత్, షామిలి ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు.

09/01/2016 - 20:54

నిఖిల్‌కుమార్ కధానాయకుడిగా చెన్నాంబికా ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రంకోసం ఇటీవల బల్గేరియాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు.

09/01/2016 - 18:08

దిల్లీ: విలువలకు కట్టుబడి తమ పార్టీ, ప్రభుత్వం పనిచేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సిఎం కేజ్రీవాల్ గురువారం మీడియాతో అన్నారు. తన మంత్రివర్గం నుంచి సందీప్‌కుమార్‌కు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తన పార్టీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.

09/01/2016 - 18:08

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గోవా యాత్రకు వెళ్తున్నారు. ఈనెల 3, 4 తేదీల్లో ఆయన గోవాలో విశ్రాంతి తీసుకుంటారు. 5న వినాయక చవితి పూజల్లో పాల్గొనేందుకు తిరిగి విజయవాడ చేరుకుంటారు.

09/01/2016 - 18:07

ఏలూరు: అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ ఘటన గురువారం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య వరలక్ష్మిపై భర్త నరసింహమూర్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చిన అత్తపైనా దాడి చేశాడు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా వరలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.

09/01/2016 - 18:01

హైదరాబాద్‌ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం నుంచి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని, ఒడిశా నుంచి దక్షిణ తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి ఉండడంవలన రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

09/01/2016 - 17:56

దిల్లీ: రెండు, మూడు తేదీల్లో వియత్నాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడితో సమావేశమై, దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.

09/01/2016 - 17:53

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసూతి సెలవును 6 నుంచి 9 నెలలకు పెంచారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత గురువారం ప్రకటించారు. గతంలో తమ ప్రభుత్వం 90 రోజులున్న ప్రసూతి సెలవులను 6 నెలలకు పెంచిందని గుర్తుచేశారు. ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మించడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

09/01/2016 - 17:32

ముంబై : రిలయన్స్ జియో డేటా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలు బెంబెలెత్తిపోతున్నాయి. ఎయిర్‌ టెల్‌, ఐడియా రూ. 12 వేల కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయాయి. రిలయన్స్ దెబ్బకు టెలీకాం కంపెనీలు దాదాపు రూ. 14 వందల కోట్లు నష్టపోయాయి. ఐడియా షేరు 10.49 శాతం, ఎయిర్‌ టెల్‌ 6.27 శాతం కోల్పోయాయి.

09/01/2016 - 17:28

చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా కేంద్రం నిధులు ఇస్తుందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఎంపీ హరిబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్రం ఆలోచిస్తోందని అన్నారు.

Pages