S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 06:26

గుంటూరు, ఆగస్టు 6: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తున్నా పనులు కొలిక్కిరావడం లేదు. పుష్కరాలకు గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో అమరావతి, ధరణికోట, సీతానగరం ఘాట్లను ఏ కేటగిరి పరిధిలో ప్రత్యేక అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు.

08/07/2016 - 06:24

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 6: కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులతో ఆర్టీసీ సిబ్బంది, కండక్టర్లు గౌరవ ప్రదంగా వ్యవహరించాలని వారి మన్ననలు పొందాలని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో రీజియన్‌లోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజీ ఇన్‌ఛార్జిలు, ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 06:22

పెద్దాపురం, ఆగస్టు 6: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశించారు. మండల పరిధిలో ఆనూరు, పెద్దాపురం ప్రాంతాల్లో డయేరియా వ్యాధి విజృంభించిన నేపథ్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాధితులను శనివారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. అనంతరం వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు.

08/07/2016 - 06:20

రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నది అఖండ హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తజనం విశేషంగా తరలివస్తున్నారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో నిత్యం అంత్య పుష్కరాలను పురష్కరించుకుని అఖండ హారతి విశేషంగా జరుగుతోంది. మిగిలిన రోజుల్లో నిత్య హారతి ఇస్తున్నారు. అంత్య పుష్కరాలు పనె్నండు రోజుల పాటు అఖండ హారతి ఇస్తున్నారు.

08/07/2016 - 06:19

రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నదిలో వరద ప్రవాహం.. రేవుల్లో భక్తి పారవశ్యం అన్నట్టుగా మారింది అంత్య పుష్కర సందడి చూస్తుంటే..! గోదావరి నది వరద గోదావరిగా మారింది.. కొండ కోనల్లోని ఔషధ గుణాల సారాన్ని మోసుకొస్తూ అఖండ గోదావరిగా ఉరకలేస్తోంది. శనివారం నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 14.9 అడుగుల మట్టంలో ప్రవహిస్తోంది.

08/07/2016 - 06:16

తిరుపతి, ఆగస్టు 6: రాష్ట్రంలోని భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసి మీ భూమి డాట్ కామ్ లో (వెబ్‌ల్యాండ్)లో పొందుపరచడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జెసి శర్మ తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథిభవనంలో 4 జిల్లాల సంయుక్త కలెక్టర్‌తో డాట్ ల్యాండ్‌పై ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 06:15

పుత్తూరు, ఆగస్టు 6: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ వెబ్‌సైట్‌లో ట్విట్టర్‌లో విసూర్లు మాని పార్లమెంటులో పోరాడితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీకి టిడిపి ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమనాయుడు హితవుపలికారు.

08/07/2016 - 06:15

తిరుపతి, ఆగస్టు 6: ఆక్సిజన్ మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీ చైర్మన్, ఎంపి ప్రమోద్ సక్సేనా శనివారం టిటిడి నిర్వహిస్తున్న బాలమందిర్ ట్రస్టుకు 5లక్షల విరాళాన్ని తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు.
12న ఇఎస్‌ఐ, ఆర్థిక శాఖ కమిషనర్ రాక

08/07/2016 - 06:14

మదనపల్లె, ఆగస్టు 6: కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తు పెన్షన్‌స్కీమ్ కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు.

08/07/2016 - 06:11

తిరుపతి, ఆగస్టు 6: స్వచ్ఛ సర్వెక్షన్ -2017 కు ర్యాంకులు పొందడానికి పోటీపడి అభివృద్ధి చేయాలని ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దేశంలోని 500 నగరాలకు చెందిన మునిసిపల్, నగర పాలక సంస్థ కమిషనర్‌లకు సూచించారు.

Pages