S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 05:49

వరంగల్, ఆగస్టు 6: ‘ఆచార్య జయశంకర్ సార్ గొప్ప కాలజ్ఞాని’ అని స్పీకర్ మధుసూదనాచారి ఉద్ఘాటించారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్బంగా హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతివనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

08/07/2016 - 05:46

ఇందూర్, ఆగస్టు 6: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ముందుకు సాగిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రభుత్వ యంత్రాంగం బంగారు తెలంగాణ ఏర్పాటుకు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో శనివారం అధికారికంగా నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

08/07/2016 - 05:45

బాన్సువాడ, ఆగస్టు 6: గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రాల వరకు ఆయా స్థాయిలలో ఆధునీకరిస్తున్న రహదారులను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రవాణా వసతిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయిస్తోందని చెప్పారు.

08/07/2016 - 05:42

నల్లగొండ టౌన్, ఆగస్టు 6 : కృష్ణ పుష్కరాలు సమీపిస్తుండటంతో శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పానగల్‌లోని ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్ల పనులను వాటి తీరుతెన్నులను టి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర అభివృద్ధి పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

08/07/2016 - 05:41

మిర్యాలగూడ, ఆగస్టు 6: ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాదూరి కరుణ అన్నారు. శనివారం పట్టణంలోని ఆమె స్వగృహంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలలోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని ఆమె కోరారు.

08/07/2016 - 05:41

నల్లగొండ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చూపిన తోవలో తెలంగాణ పునర్ నిర్మాణానికి, బంగారు తెలంగాణ సాధనకు ప్రజలంతా ముందుకు సాగాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించి, జయంతి సందర్భంగ నివాళులు అర్పించారు.

08/07/2016 - 05:40

కోదాడ, ఆగస్టు 6: సహకార సంఘాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతిరెడ్డి కోరారు. కోదాడ మండలం గోండ్రియాల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన సహకారగోదాంను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు.

08/07/2016 - 05:38

నల్లగొండ, ఆగస్టు 6: బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి శ్రేణులు ముందునడువాలని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఉద్బోధించారు. తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ రాష్ట్ర ప్రతినిధుల సభ రెండో రోజు శనివారం ముగింపు సందర్భంగా ఆమె ప్రతినిధులనుద్ధేశించి ప్రసంగించారు.

08/07/2016 - 05:35

సిద్దిపేట, ఆగస్టు 6: మనోహరాబాద్- సిద్దిపేట- కొత్తపల్లి రైల్వేలైన్‌కు దశాబ్దకాలం తర్వాత మోక్షం లభించనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సిద్దిపేట ప్రజల చిరకాలం వాంఛైన రైలుకూత పెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ కోమటిబండలో మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

08/07/2016 - 05:34

సిద్దిపేట, ఆగస్టు 6 : సామాన్య వ్యక్తి నుంచి అసామాన్యమైన స్థాయికి ఎదిగి జాతిని ప్రభావితం చేసిన నేతగా ఆచార్య జయశంకర్ గుర్తింపు పొందాడని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జాతిపిత మహాత్మగాంధీ సామాన్య స్థాయి ఎదిగి దేశాన్ని ప్రభావితం చేసారని, ఆచార్య జయశంకర్ సామాన్య స్థాయి నుంచి ఎదిగి జాతిని ప్రభావితం చేసిన తీరు చారిత్రాత్మకమని కొనియాడారు.

Pages