S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 05:31

గజ్వేల్, ఆగస్ట్ 6 : ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాని నరేంద్రమోదీ గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్ నుంచి శ్రీకారం చుడుతుండడం తెలంగాణ ప్రజల అదృష్టమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని కోమటిబండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

08/07/2016 - 05:29

నవాబుపేట/జడ్చర్ల, ఆగస్టు 6: విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యా సమీక్ష సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

08/07/2016 - 05:28

మహబూబ్‌నగర్, ఆగస్టు 6: ఉపాధి హామీ పథకంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.90కోట్ల మొక్కలు నాటాల్సిందేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. శనివారం మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్‌లతో కలిసి మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 05:27

మహబూబ్‌నగర్, ఆగస్టు 6: తెలంగాణకు ఐదవశక్తి జోగులాంబ అమ్మవారు తలమానికమని కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. శనివారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు ముఖ్యఅతిథులుగా హజరయ్యారు.

08/07/2016 - 05:25

ఆదిలాబాద్, ఆగస్టు 6: బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అదిగమించి తెలంగాణకు మణిహారంగా చరిత్రను లిఖించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంతా బొగ్గును అందిస్తున్న సింగరేణి వ్యాపార దృక్ఫథంతో సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

08/07/2016 - 05:24

ఉట్నూరు, ఆగస్టు 6: నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శనివారం పిఎమ్మార్సీ భవనంలో రెండవ విడత హరితహారం కార్యక్రమంలోని భాగంగా ఉట్నూరు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 05:22

ఉట్నూరు, ఆగస్టు 6: తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ సర్‌కు వాడవాడల ఘన నివాళులర్పించారు. శనివారం జయశంకర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొమురం భీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ భవనంలో జయశంకర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ జగన్మోహన్ పాల్గొని పూలమాలలువేసి నివాళులర్పించారు.

08/07/2016 - 05:19

ఖానాపూర్, ఆగస్టు 6: రాష్ట్ర సాధనకు దిశా నిర్దేశం చేసిన జయశంకర్ చరిత్రలో నిలిచిపోయారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ఖానాపూర్‌లో జయశంకర్ జయంతి వేడుకలను టిఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయ. తెలంగాణచౌరస్తాలో జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యేతోపాటు మార్కెట్ చైర్మెన్ సక్కారాం శ్రీనివాస్, ఎంపిటిసి సునీత, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

08/07/2016 - 05:05

చేవెళ్ల, ఆగస్టు 6: చదువు పేదరికానికి అడ్డుకాదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలఫ్‌మెంట్, పంచాయతీరాజ్, డైరెక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సిహెచ్‌ఆర్ గార్డెన్‌లో వివేకానంద జూనియర్, డిగ్రీకళాశాల ఫ్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.

08/07/2016 - 05:05

హైదరాబాద్, ఆగస్టు 6: కాలుష్య రహిత వాహనాలకు ప్రోత్సహకాలు అందిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం చందానగర్‌లోని స్పోర్ట్స్ హబ్‌ను ఆయన స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన హీరో సైకిల్ కంపెనీ వారి ఈ-బైక్ (ఎలక్ట్రికల్)ను ఆవిష్కరించారు.

Pages