S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 06:09

ఖాజీపేట,ఆగస్టు 6: రాయలసీమ ఆయకట్టు సస్యశ్యామలం, రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఇందుకోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కెసి కాలువ ప్రాజెక్టుల వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖరరెడ్డిలు అన్నారు.

08/07/2016 - 06:04

ఉరవకొండ, ఆగస్టు 6 : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీలేని పోరాటం చేస్తున్నారని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెన్నోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఎంపి జెసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు, సస్యశ్యామలం చేయడం కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు.

08/07/2016 - 06:03

ధర్మవరం రూరల్, ఆగస్టు 6: ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తామని, ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చామని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో వున్నా మాట తప్పేది లేదంటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ధర్మవరంలో శనివారం జరిగిన చేనేత రుణ విమోచన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోమారు చేనేతల ఆశలకు ఊపిరి పోశారు.

08/07/2016 - 06:00

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 6: కార్మిక సమస్యలపై వచ్చే నెల 2వ తేదీన నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మె జయప్రదానికై కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో ఈ నెల 9న సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ఇఫ్టూ జిల్లా కార్యదర్శి జి రామయ్య తెలిపారు.

08/07/2016 - 06:00

భద్రాచలం, ఆగస్టు 6: గోదావరికి జనం నీరాజనం పలుకుతున్నారు. అంత్యపుష్కరాలు 7వ రోజు శనివారం కూడా భక్తుల సందడి స్నానఘట్టాల వద్ద కన్పించింది. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరి తీరంలో భక్తుల కోలాహాలంతో భక్తి భావం ఉప్పొంగుతోంది. భక్తులతో పుష్కరుడు పరవళ్లు తొక్కుతున్నాడు.

08/07/2016 - 05:57

రుద్రంపూర్, ఆగస్టు 6: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెడగపల్లి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన 1200ల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటును దేశ ప్రధాని నరెంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

08/07/2016 - 05:56

మధిర, ఆగస్టు 6: క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా జరిగే సన్మానానికి ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుడు ఐతం వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి పది మంది ఈ సన్మానానికి ఎంపిక కాగా ఖమ్మం జిల్లా నుండి ఐతం వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు.

08/07/2016 - 05:55

ఖానాపురం హవేలి, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో జెసి దివ్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

08/07/2016 - 05:52

వరంగల్, ఆగస్టు 6: భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వరంగల్‌లో ఆదివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగే వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచే రిమోట్ ద్వారా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేస్తారు. రూ.

08/07/2016 - 05:51

నక్కలగుట్ట, ఆగస్టు 6: తెలంగాణ భాషా సాహిత్యాలకు 300 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని వరవరరావు అన్నారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ 82వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్మారకోపన్యాసం నిర్వహించారు. కెయు ఉపకులపతి ప్రొఫెసర్ సాయన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా వరవరరావు హాజరయ్యారు.

Pages