S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 22:54

మన జీవితంలో మలుపు తిప్పే వ్యక్తులకు, మనల్ని ఆనందంగా ఉంచే వారికీ కృతజ్ఞతలు చెప్పడం ఎంతో అవసరం అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ మహత్తరంగ ఉంది. వైద్యం వ్యాపారం అయిపోయిందని ఒక పాఠకుడు చింతించారు. భూమి, నీరు, ఉద్యోగాలు అన్నీ వ్యాపారాలుగా మారిపోవడానికి అసలు కారణం విద్య వ్యాపారంగా మారటమే. రాజకీయాలు వ్యాపారంగా మారిపోవడం మరో ముఖ్య కారణం.

08/06/2016 - 22:53

........................................................

08/06/2016 - 22:19

ఒక్కసారి
బ్యాటరీ తినిపిస్తే చాలు
చాకిరీ చేస్తుంది
గడియారం
* * *

గవ్వలే
చలామణిలో వుంటే
సముద్రాలను
బతకనిచ్చేవారా?
* * *

నీ ఒంటికి పూసిన
అత్తరు ఎక్కడిది?
గులాబీలు చిందించిన
రక్తమే!
* * *

08/06/2016 - 22:18

ఒలింపిక్స్‌లో పోటీపడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు గ్రీక్ జిమ్నాస్ట్ దిమిత్రియస్ లాడ్రాస్ పేరుమీద ఉంది. 1896 ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ చిచ్చరి పడుగు వయసు 10 సంవత్సరాల 218 రోజులు. ఎంతో మంది అనుభవజ్ఞులతో తీవ్రంగా పోటీపడిన అతను కాంస్య పతకాన్ని సాధించాడు. తర్వాతి కాలంలో అతను గ్రీక్ నావికాదళంలో చేరి, అడ్మిరల్ స్థాయికి చేరుకున్నాడు.

08/06/2016 - 22:17

ఏ రాత్రి
ఏ పగలు
నా యింటి ముందు తోరణం నవ్వటం
నేను చూడలేదు

ఏ ఉదయం
ఏ సాయంకాలం
నా ఇంటి వెనుక మల్లెతీగ
మందహాసం నేను చూడలేదు

08/06/2016 - 22:16

రియో డి జెనీరోలో తుపాకీ సంస్కృతి శ్రుతి మించుతున్నది. నగరం నడిబొడ్డున పోలీస్ బృందంపై డ్రగ్స్ మాఫియా విరుచుకుపడి కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే డ్రగ్స్ మాఫియా ఏకంగా పోలీస్‌లపైనే కాల్పులకు తెగబడడం అధికారులకు, ఒలింపిక్ నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. రియోలో దాదాపు ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల మోత వినిపిస్తునే ఉంటుంది.

08/06/2016 - 22:15

బెజవాడ కనకదుర్గమ్మ చల్లని చూపులతో
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడగా
తెలుగింట కళకళలాడే కళావైభవంగా
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం

అమరావతి రాజధాని శోభతో
అలరారే కృష్ణానదీ తరంగాల
తెలుగు తల్లికి మంగళ హారతులు అందిస్తూ
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం

08/06/2016 - 22:14

బాస్కెట్‌బాల్ అధికారికంగా మొట్టమొదటిసారి 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో దర్శనమిచ్చింది. బంకమట్టి, ఇసుక కలిపి తయారు చేసిన అవుట్ డోర్ కోర్టులో మ్యాచ్‌లను ఆడించారు. మ్యాచ్‌లన్నీ సజావుగానే సాగినప్పటికీ, అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మాత్రం నానా కంగాళీగా మారింది. భారీ వర్షం కురవడంతో కోర్టు మొత్తం బురదమయంకాగా, బంతిని టాస్ చేయడానికి ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు.

08/06/2016 - 22:13

ఫిగర్ స్కేటింగ్, ఐస్ హాకీ ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాంశాలు. కానీ, ఈ రెండు క్రీడలు మొదట సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టాయి. 1908, 1920 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఫిగర్ స్కేటింగ్ పోటీలు జరిగాయి. 1924లో ఈరెండు ఈవెంట్స్‌ను వింటర్ ఒలింపిక్స్ జాబితాలో చేర్చారు. ఐస్ హాకీ 1920లో మొదటిసారి సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అరంగేట్రం చేసింది.

08/06/2016 - 22:11

ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఎన్నో దశల్లో ప్రతిభ కనబరచాలి. కనీసం వైల్డ్‌కార్డ్ ఎంట్రీతోనైనా బరిలోకి దిగాలి. కానీ, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్టు తెలియకుండానే పోటీకి దిగి, విజేతగా నిలిచింది మార్గరెట్ అబోట్. అమెరికాకు చెందిన మార్గరెట్ 1900 పారిస్ ఒలింపిక్స్ సమయంలో అక్కడే ఎడ్గర్ డెగాస్ అండ్ అగస్టే రాడిన్‌లో చదువుతున్నది.

Pages