S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 20:56

బిచ్చగాడుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని మరోసారి భేతాళుడుగా రానున్నాడు. తమిళంలో రూపొందించిన సైతాన్ చిత్రాన్ని తెలుగులో భేతాళుడుగా అనువదించారు. మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

08/06/2016 - 20:55

సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని అఖిల్ ఆడియోను, ట్రైలర్‌ను హీరో సుమంత్ విడుదల చేశారు.

08/06/2016 - 20:52

ధీరు మహేష్, సుదర్శన్, సురేష్, ఇషికాసింగ్, ప్రియాంక ప్రధాన తారాగణంగా శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు సిద్ధం చేశారు.

08/06/2016 - 20:51

ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా ఎక్కువయింది. ముఖ్యంగా ఇలాంటి.. సినిమాలు బాక్స్‌ఆఫీస్‌వద్ద దుమ్మురేపుతున్నాయి. అందులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌తో ఇప్పుడు చాలామంది ఈ తరహా సినిమాలు తీయడానికి సిద్ధంఅయ్యారు. లేటెస్ట్‌గా ఓ సినిమాకోసం హాట్‌భామ విద్యాబాలన్ ఏకంగా 18 కోట్లు అడిగిందట!! ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు! నిజంగా బాలీవుడ్‌లో ఇది రికార్డ్ అని చెప్పాలి.

08/06/2016 - 20:49

మరో వారసురాలుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి త్వరలోనే కథానాయికగా పరిచయవౌతోంది. ఫిల్మ్ యాక్టింగ్‌లో కోర్సుచేస్తున్న ఆమె తెలుగులోగానీ, లేదంటే తమిళంలోగానీ ఎక్కడ మంచి అవకాశమొస్తే అక్కడ్నుంచి ఇంట్రడ్యూస్ అవ్వాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. గౌతమి కూడా ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ఒప్పేసుకుంది.

08/06/2016 - 20:47

రోషిత్, షాలు, చరణ్ నాయుడు, కరుణాకర్, కల్యాణి ప్రధాన తారాగణంగా వన్ మన్ క్రియేషన్స్ పతాకంపై పాల్వాయి సుదర్శన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అరణ్యంలో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.

08/06/2016 - 18:17

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. బంద్‌లు, ఆందోళనలతో హోదా రాదని, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిల్లీలో దీక్షలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు సిఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీతో, కేంద్రమంత్రులతో చర్చలు జరిపారన్నారు. త్వరలోనే ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు.

08/06/2016 - 18:16

ఒంగోలు: శ్రీశైలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా గండ్లకమ్మ వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన 20 మందిని పోలీసులు వైద్య చికిత్స నిమిత్తం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ వైర్లు బస్సుకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు చెప్పారు.

08/06/2016 - 18:16

హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఓ ప్రముఖ చెప్పుల దుకాణంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని, భారీగా ఆస్తినష్టం జరిగిందని సమాచారం. మంటలను ఆర్పివేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను ఉపయోగిస్తున్నారు.

08/06/2016 - 18:16

హైదరాబాద్: ప్రజాసమస్యలను గాలికొదిలేసి, రాష్ట్రాన్ని తెరాస సర్కారు అప్పుల ఊబిలోకి నెడుతోందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద శనివారం టి.టిడిపి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.

Pages