S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 01:06

ఇస్లామాబాద్, ఆగస్టు 6: భారత్‌లో దాడులకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ మరోసారి బాహాటంగా తన నైజాన్ని చాటుకుంది. కాశ్మీరు అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చేందుకు పదేపదే విఫలయత్నాలు చేస్తున్న పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, కాశ్మీరు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి వైద్య సహాయాన్ని అందజేస్తామని శనివారం ప్రకటించారు. కాశ్మీరు సమస్యను ‘మానవతా సంక్షోభం’గా ఆయన అభివర్ణించారు.

08/07/2016 - 01:06

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణకు తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తి చేయకపోవటంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పొన్నాల శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆదివారం పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించడాన్ని తప్పుపట్టారు.

08/07/2016 - 01:05

కోక్రాఝార్ (అస్సాం), ఆగస్టు 6: ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) బృందం శనివారం పరిశీలించింది. దాడి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఉగ్రవాద దాడిలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

08/07/2016 - 01:03

‘జోరుగా..హుషారుగా షికారు చేద్దామా..హాయి హాయిగా..’ అంటూ భలే హుషారైన జోష్‌తో అందర్నీ అలరిస్తోంది అందాల భామ రాశీఖన్నా. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే భలే క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ‘సుప్రీమ్’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలు.. టాప్ హీరోల సరసన ఆడిపాడే ఛాన్స్ దక్కుతోంది. తాజాగా గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది.

08/07/2016 - 01:01

బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా గురించే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె తాజాగా నటించిన ‘డిషూమ్’ చిత్రంలోని ‘జానే మన్ ఆ..’పాట ఎక్కడ విన్నా మారుమోగిపోతోంది. ఈ పాటపై వరుణ్‌ధావన్‌తో జతకట్టిన పరిణితి పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు అంటున్నారు బాలీవుడ్ జనాలు. ‘డిషూమ్’లో ప్రత్యేక గీతమైన ఈ పాట అందరి నోళ్లలో అంతగా నానడానికి కారణం పరిణితి-వరుణ్‌ల లిప్‌లాకేనని చెప్పుకుంటున్నారు.

08/07/2016 - 01:01

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విజయ్ మాల్యాకు ఓ ఢిల్లీ కోర్టు శనివారం నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మాల్యాపై ఇది నాలుగో నాన్-బెయలబుల్ వారెంట్. 2012 లో చెక్ బౌన్సు కేసుకు సంబంధించి ఈ వారెంట్‌ను ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమీత్ ఆనంద్ జారీ చేయగా, నవంబర్ 4న కోర్టుకు మాల్యా హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

08/07/2016 - 01:00

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంకు నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో ఏకంగా 84 శాతం క్షీణించింది. 31.09 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో 202 కోట్ల రూపాయల లాభాన్ని పొందినట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

08/07/2016 - 00:58

ముంబయి, ఆగస్టు 6: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం పలికిన క్రమంలో వరుస నష్టాలకు బ్రేక్ పడినప్పటికీ, చెప్పుకోదగ్గ లాభాలు మాత్రం రాలేదు. నిజానికి జిఎస్‌టి కంటే కూడా విదేశీ పరిణామాలు గడచిన వారం భారతీయ మార్కెట్లపై అధిక ప్రభావం చూపడం గమనార్హం.

08/07/2016 - 00:58

స్టార్..స్టార్ అంటున్నారు ఇప్పుడు అనుష్కశర్మను చూసి బాలీవుడ్. ‘పీకే’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తాజా చిత్రం ‘సుల్తాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో మరోసారి అనుష్కకు భలే క్రేజ్ వచ్చింది. ‘సుల్తాన్’తో వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల లిస్టులో చేరిపోయింది.

08/07/2016 - 00:57

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య, పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విమానాశ్రయాలున్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన ప్రకాశం జిల్లా దొనకొండ, కడపలోని విమానాశ్రయాలను పునరుద్ధరించనున్నారు.

Pages