S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:58

బంటుమిల్లి, ఆగస్టు 5: స్థానిక శ్రీ సీతాకోదండరామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ ఆచార్యత్వంలో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.31ని.లకు శ్రీ సీతా కోదండ రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలను యాగశాలలో ప్రవేశ పెట్టారు.

08/06/2016 - 02:57

పటమట, ఆగస్టు 5: కృష్ణా పుష్కరాలలో అధికారుల శక్తి, సామర్ధ్యం, నైపుణ్యత ముఖ్యమని, పుష్కరాలకు వచ్చే యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.

08/06/2016 - 02:56

విజయవాడ, ఆగస్టు 5: ప్రకాశం బ్యారేజి శాశ్వత సుందరీకరణలో భాగంగా రూ.6 కోట్లతో ఏర్పాటుచేసిన ఎల్‌ఇడి (ఆర్‌జిబి) లైటింగ్ విద్యుత్ దీపాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. డిఎంఎస్ కంట్రోల్ విధానంలో పనిచేసే ఈ విద్యుత్ దీపాలు ప్రకాశం బ్యారేజిను శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ వెలుగులు నింపుతుంది.

08/06/2016 - 02:56

విజయవాడ (క్రైం), ఆగస్టు 5: ప్రతిష్ఠాత్మక కృష్ణా పుష్కరాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరోవారం రోజుల్లో నగరంలో ప్రారంభం కానున్న పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తకోటి, యాత్రికుల భద్రత, విఐపిల రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, బందోబస్తు నిర్వహణకు నగర పోలీసుశాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది.

08/06/2016 - 02:55

విజయవాడ, ఆగస్టు 5: పుష్కరాలకు చేపడుతున్న అన్ని నిర్మాణ పనులు రెండు రోజుల్లో పూర్తి చేసి సిద్ధంగా ఉంచడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దుర్గా ఘాట్‌లో జరుగుతున్న పనులను గురువారం ఉదయం మంత్రి పరిశీలించారు.

08/06/2016 - 02:55

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 5: ఈనెల 12వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కృష్ణాపుష్కరాలకు విఎంసి కార్యాలయం లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల నిర్వహణనే కాకుండా పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసే ప్రక్రియ నిర్వహణకు విఎంసి కార్యాలయానే్న వేదికగా ఎంచుకోవడంతో అందుకనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

08/06/2016 - 02:54

విజయవాడ, ఆగస్టు 5: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటం కన్నా అసెంబ్లీలో సీట్లు పెంచుకోవటంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు ధ్వజమెత్తారు.

08/06/2016 - 02:53

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 5: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీకనకదుర్గమ్మను శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున పలువురు విఐపిలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు.

08/06/2016 - 02:51

విశాఖపట్నం, ఆగస్టు 5: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జిల్లా నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు స్థానిక సవేరా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి.

08/06/2016 - 02:50

విశాఖపట్నం, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా పలు స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ఘన వ్యర్ధాల నిర్వహణ సమస్యకు చక్కని పరిష్కారం చూపాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక తాజ్‌గేట్ వే హోటల్‌లో సిఐఐ, ఏపిటిడిసి సంయుక్త ఆధ్వర్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Pages