S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:24

ఏటూరునాగారం, ఆగస్టు 5: కలెక్టర్ వాకాటి కరుణ ఏటూరునాగారం మండలం ఏజన్సీ గ్రామాలలో పర్యటించారు. గురువారం రాత్రి ఐటిడిఎ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష అనంతరం రాత్రి ఏజన్సీలోనే బసచేశారు. శుక్రవారం ఉదయం మండలంలోని చల్పాక, బన్నాజిబంధం గ్రామాలను సందర్శించి, ఇటీవల నూతనంగాచేపట్టిన బిటి రోడ్ల నాణ్యతలను పరిశీలించారు.

08/06/2016 - 02:23

కల్చరల్ (వరంగల్), ఆగస్టు 5: వరంగల్ మహా నగరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్ని శుక్రవార శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసంలోమొదటి శుక్రవారం కావడంతో వేలాదిగా మహిళలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలను జరుపుకున్నారు. నగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని అమ్మవారి దేవాలయాలలో భక్తులు ప్రత్యేక కుంకుమార్చనలు చేసారు.

08/06/2016 - 02:23

మంగపేట, ఆగస్టు 5: మంగపేట పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలలో ఆరవ రోజు శుక్రవారం భక్తులు పెరిగారు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజు ఆదివారం నుండి గురువారం వరకు అంతంత మాత్రమే విచ్చేసిన భక్తులు శుక్రవారం మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది శుక్రవారం మంగపేట పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు.

08/06/2016 - 02:22

వరంగల్, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక డివిజన్‌లలో ఆయన హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్‌తో పాటు ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు పాల్గొన్నారు.

08/06/2016 - 02:22

పరకాల, ఆగస్టు 5: జిల్లాకు 4 లక్షల టేకు వేర్లు కేటాయించగా అందులో 80 వేల టేకు వేర్లు పరకాల డివిజన్‌లోని నాలుగు మండలాలకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ సంచాలకురాలు ఉష తెలిపారు. శుక్రవారం పరకాల మండలం చర్లపల్లి, రాయపర్తి, నర్సక్కపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా జెడిఏ ఉష, పరకాల జడ్పిటిసి పాడి కల్పనాదేవిలు టేకు వేర్లు నాటారు.

08/06/2016 - 02:21

ఏటూరునాగారం, ఆగస్టు 5: ఏజన్సీ ప్రాంతాలలోని ప్రజలు ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపాలంటే నిషేధిత మత్తు పదార్ధాలపై (గుట్కా, అంబర్) పోలీసులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు.

08/06/2016 - 02:20

గోవిందరావుపేట, ఆగస్టు 5: తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబపాలనకు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు దుయ్యబట్టారు. మండల కేంద్రంలో శుక్రవారం ములుగునియోజకవర్గస్ధాయి తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియెజక ఇంచార్చ్ సీతక్క ఆధ్వర్యంలో జరిగింది.

08/06/2016 - 02:20

వరంగల్, ఆగస్టు 5: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ (స్థాయి సంఘం) ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుండి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న స్క్రూట్నీ పరిశీలన అనంతరం చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

08/06/2016 - 02:19

వడ్డేపల్లి, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి అనాలోచిత పనుల వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పోశాల పద్మ అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న కెసిఆర్ ప్రభుత్వం, వారి ఆశలను ఆడియాశలు చేసిందని విమర్శించారు.

08/06/2016 - 02:18

ములుగు, ఆగస్టు 5: మండలంలోని మదనపల్లి యుపిఎస్ పాఠశాలను శుక్రవారం గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా విధుల్లోలేని హెచ్‌ఎం భవాని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మరో ఉపాధ్యాయుడు కుమారస్వామిని సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌ను మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

Pages