S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:41

పీలేరు, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి తీసుకొని రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపిలు ఎనలేని కృషిచేస్తున్నారని రాష్ట్ర ఐటి, మైనార్టీ, ఫౌర సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

08/06/2016 - 02:39

తిరుమల, ఆగస్టు 5: రామానుజ సహస్త్రాబ్ధి ఉత్సవాలు పురస్కరించుకొని రామానుజ విగ్రహాలను ఏర్పాటుచేస్తే బాగుంటుందని భీమవరానికి చెందిన నాని, ఉదయ్ భాస్కర్ అనే భక్తులు డయల్ యువర్ ఇ ఓలో ఇ ఓ డాక్టర్ సాంబశివరావును కోరారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమం జరిగింది.

08/06/2016 - 02:36

తిరుమల, ఆగస్టు 5: జూలైలో శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారని, అదేస్థాయిలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం కూడా పెరిగిందని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు.

08/06/2016 - 02:35

తిరుమల, ఆగస్టు 5: తిరుమలలో అనంతాళ్వార్ తిరువాడి పురై ఉత్సవాన్ని శుక్రవారం సాయంత్రం తిరుమలలో టిటిడి అధికారులు ఘనంగా నిర్వహించారు. పర్వతమే తన తత్వంగా నిరంతరం భగవంతుని దివ్యలీలా రూప వైభవాదుల దివ్యానుభూతిలో ఆనందం అనుభవిస్తూ ఉండే వారు అగుట చేతనే అనంతాళ్వార్ అనే నామదేయం ప్రసిద్ధి చెందింది.

08/06/2016 - 02:35

తిరుపతి, ఆగస్టు 5: స్విమ్స్ యూనివర్సిటీ అనుబంధంగా నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో శుక్రవారం ఎంబిబిఎస్ కోర్సులకు ఓపెన్ కేటగిరిలో కౌనె్సలింగ్ నిర్వహించారు. తొలిరోజు 59 సీట్లకు సంబంధించి కౌనె్సలింగ్ నిర్వహించారు. కాగా శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కు చెందిన విద్యార్థులకు 63 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

08/06/2016 - 02:34

చిత్తూరు, ఆగస్టు 5: జిల్లాలోని కమ్యూనిటీ పోలీసు ఆఫీసర్లు(సీపీవో) లు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆకాంక్షించారు.

08/06/2016 - 02:34

చిత్తూరు, ఆగస్టు 5: అసమానతలకు గురౌతున్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు వర్తిస్థాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ తెలిపారు. శుక్రవారం చిత్తూరులో ఎస్సీల హక్కులు పరిరక్షణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్లు షెడ్యూల్డు కులాలకే కాదని, అసమానతులకు గురైతున్నా అందరికి చెందుతాయని, షెడ్యూల్డు కులాలు రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డాయన్నారు.

08/06/2016 - 02:33

తిరుచానూరు, ఆగస్టు 5: తిరుపతి నగర శివార్లలో ఉన్న నవజీవన్ ఆశ్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్లానింగ్, స్టాటిస్టిక్స్ మంత్రిగా ఎం.సీతారామ్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు వీరమణికంఠ వస్తద్రానం, అన్నదానం నిర్వహించారు.

08/06/2016 - 02:32

తిరుమల, ఆగస్టు 5: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ అయిన రేమాండ్స్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా శుక్రవారం టిటిడికి సుమారు 6 లక్షల రూపాయలు విలువచేసే 500 కంబళ్లను విరాళంగా అందించారు. వీటిని తిరుమల జె ఇ ఓ శ్రీనివాస రాజు స్వీకరించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మాట్లాడుతూ గతంతో కూడా గౌతమ్ సింగానియా టిటిడిలోని పలు కాటేజీలకు కంబళ్లను విరాళంగా అందించారన్నారు.

08/06/2016 - 02:30

వెల్గటూరు, ఆగస్టు 5: అడవులను పెంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములై భావితరాల వారికి భవిష్యత్ కల్పించాలని అన్నారు. మండలంలోని ముత్తునూరు, ముక్కట్రావుపేట, కప్పర్రావుపేట, వెల్గటూరు గ్రామాల్లో శుక్రవారం సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు లక్షల మొక్కలు నాటారు.

Pages