S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 23:45

జగిత్యాల, జూలై 4: జగిత్యాల మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల పనుల కోసం నిర్వహించిన టెండర్లలో గుత్తేదార్లు రింగ్‌గా మారారు. నిబంధనలు పక్కన పెట్టి ఏకపక్షంగా టెండర్లు పొందేందుకు అంతా ఏకమయ్యారు.

07/04/2016 - 23:43

వరంగల్, జూలై 4: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం టిఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సోమారపు సత్యనారాయణ హాజరై మాట్లాడారు. దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తింపు పొందారని అన్నారు.

07/04/2016 - 23:43

వరంగల్, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో హరితహారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది హరితహారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.

07/04/2016 - 23:42

వడ్డేపల్లి, జూలై 4: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నష్టాల బారినుండి కాపాడుకోవడానికి సమష్టిగా కృషి చేద్దామని చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలోని వన్‌డిపోను సందర్శించి కార్మికులతో ముచ్చడించారు.

07/04/2016 - 23:41

వరంగల్, జూలై 4: తెలంగాణ ఉద్యమంలో నాటి రైతాంగ సాయుధ పోరాట యోధుల పేర్లు చెప్పుకొని గద్దెనెక్కిన వారు, నాటి పోరాట యోధుల త్యాగాలను గుర్తించడం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సభ జరిగింది.

07/04/2016 - 23:41

జనగామ టౌన్, జూలై 4: జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఉద్యమం అనేక అడ్డంకులు, నిషేధాల్ని అధిగమిస్తూ సాగుతోంది. ఉద్యమకారుల విధ్వంసాలు, పోలీసుల లాఠీచార్జిలతో గత రెండు రోజుల వరకు ఉద్రిక్తంగా మారిన జనగామ పోలీసుల బలగాలతో మోహరించి భయం గుప్పిట్లోకి వెళ్లింది. జిల్లా సాధన ఐకాస సోమవారం ఇచ్చిన జైల్‌భరో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.

07/04/2016 - 23:40

వరంగల్, జూలై 4: తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. రోజుకు మూడు కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తుందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం వరంగల్ డిపో-1ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పని చేసి ఆర్టీసీ బలోపేతం చేయాలన్నారు.

07/04/2016 - 23:38

నిజామాబాద్, జూలై 4: తెలంగాణ హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఇంటింటా పెరటి మొక్కలను నాటించాలని, ఈ నెల 8వ తేదీన ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 28లక్షల పెరటి మొక్కలు నాటేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు.

07/04/2016 - 23:38

నిజామాబాద్, జూలై 4: బంగారు తెలంగాణకు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ అమలు చేస్తుండగా, క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఈ పథకం కింద అడిగిందే తడవుగా ప్రభుత్వం మంజూరీలు ఇస్తూ, పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుండడంతో అక్రమార్కులు ఇదే అదనుగా భావిస్తూ అందిన మేరకు దోచుకుంటున్నారు.

07/04/2016 - 23:37

మోర్తాడ్, జూలై 4: నిర్మాణం జరిగి పక్షం రోజులైనా కాలేదు. 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడిక్కడా ధ్వంసమైపోయింది. గడిచిన 8మాసాలుగా కొనసాగుతూ వచ్చిన రోడ్డు నిర్మాణం కనీసం కొన్ని రోజులైనా ప్రజలకు ఉపయోగపడలేకపోయింది. మోర్తాడ్‌లోని సురేష్‌కాలనీ వద్ద నుండి తక్కురివాడ, భీమ్‌గల్ రోడ్డును కలుపుతూ 35 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు.

Pages