S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 00:50

హైదరాబాద్, జూలై 4: రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8న ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం సచివాలయం నుండి హరితహారం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/05/2016 - 00:50

హైదరాబాద్, జూలై 4: పాతబస్తీలోని చార్మినార్, మదీనా, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పర్యటించారు. రంజాన్ పండుగా సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిపి అధికారులను అదేశించారు. నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు.

07/05/2016 - 00:50

చార్మినార్, జూలై 4: భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయాన్ని చేస్తామంటూ హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ చేసిన వ్యాఖ్యలపై నగర కమలనాధులు భగ్గుమంటున్నారు. దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్న మజ్లిస్ పార్టీపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

07/05/2016 - 00:49

ముషీరాబాద్: తీవ్రవాదులకు మద్దతుగా వాఖ్యలు చేసిన అసదుద్ధీన్ ఓవైసి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి దేశ ద్రోహ కేసు పెట్టి జైలుకు పంపాలని బజ్‌రంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం బజ్‌రంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ వై.్భనుప్రకాష్ ఒక ప్రకటన విడుదల చేశారు.

07/05/2016 - 00:49

రాజేంద్రనగర్, జూలై 4: రైతు అభివృద్ధికి విస్తరణ విభాగం ఎంతో కీలకమైందని జాతీయ వ్యవసాయ విస్తరణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఉషారాణి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో యువ విస్తరణ శాస్తవ్రేత్తలకు ‘శాస్ర్తియ పరిశోధన’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు ప్రారంభమైంది.

07/05/2016 - 00:48

ముషీరాబాద్, జూలై 4: రసమయి, యువభారతి సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ సుధానిధి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య రచన ఎదలో విసిరిన ఇంధ్రదనుస్సు రుబాయి కావ్యం ఆవిష్కరణ సభ సోమవారం సాయంత్రం చిక్కడిపల్లి త్యాగరాయగానసభలో జరిగింది.

07/05/2016 - 00:47

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న 12 మంది సభ్యులతో కూడిన చైనా బృందం సోమవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి కలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్‌ఎంసిలు చేపడుతున్న పలు ప్రధాన అభివృద్ధి పనుల్లో తాము భాగస్వాములయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రతినిధుల బృందం సానుకూలతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

07/05/2016 - 00:47

హైదరాబాద్, జూలై 4: సంజీవ్‌రెడ్డినగర్ డివిజన్-6 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జలమండలి ఎండి ఎం.దానకిషోర్ తనిఖీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, వెంకటగిరి కాలనీలో సోమవారం ఎండి పర్యటించి నీటి సరఫరా, డ్రైనేజీ వంటి ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

07/05/2016 - 00:46

హైదరాబాద్, జూలై 4: మహానగరాన్ని మరింత ఆహ్లాదకరంగా, పచ్చదనంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంపై ఆయన సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు, జెఎన్‌టియు, సెంట్రల్ వర్శిటీల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

07/05/2016 - 00:46

ఉప్పల్, జూలై 4: మూసీ ప్రక్షాళన, అభివృద్ధి కోసం స్వాధీనం చేసుకున్న భూములలో తమ వాటా కింద వచ్చే ప్లాట్లను కేటాయించడంలో ప్రభుత్వ నిర్లక్షవైఖిరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

Pages