S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 23:52

గరిడేపల్లి, జూలై 4 : తెలంగాణ అంతటా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి... ఇక సాగుపై సంశయమే లేదన్న తీరుగా ప్రచారం సాగుతన్న నేపధ్యంలో... ఆయకట్టులో ఏం జరుగుతుందో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.... గత నాలుగురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.... ఆయకట్టులో మాత్రం అంతంతమాత్రంగానే వర్షాలు కురిసాయన్నది వాస్తవం... జూన్ నెలలో కనీసం వర్షపాతం నమోదుకాలేదన్నది...నిజం..

07/04/2016 - 23:50

కరీంనగర్, జూలై 4: ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) అన్నారు. ఐదేళ్ళలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమనేది మానవ చరిత్రలో మూడవ ప్రయత్నమని అన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

07/04/2016 - 23:50

లీగల్ (కరీంనగర్), జూలై 4: ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తి తీరుపట్ల న్యాయవాదులు భగ్గుమన్నారు. ఒకవైపు న్యాయమూర్తుల సస్పెన్షన్.. ఇంకోవైపు హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయపోరాటం.. మరో వైపు.. న్యాయస్థాన ఉద్యోగులు కోర్టు విధులు బహిష్కరిస్తున్న తరుణంలో కరీంనగర్ ఎసిబి కోర్టు న్యాయమూర్తి సోమవారం కోర్టు విధులను చేపట్టారు.

07/04/2016 - 23:49

కరీంనగర్, జూలై 4: భూ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో కలిసి ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11 ఫోన్ కాల్స్ రాగా, అందులో ఏడు కాల్స్ భూ సమస్యలపైనే వచ్చాయి.

07/04/2016 - 23:48

ఎల్లారెడ్డిపేట, జూలై 4: తన కొడుకు పిట్ల గిరిబాబును చంపినందుకు తండ్రి ప్రతీకారం తీర్చుకొన్నాడు.

07/04/2016 - 23:47

భీమదేవరపల్లి, జూలై 4: కెసిఆర్ సర్కార్ నిజాం పాలలను గుర్తుకు తెస్తున్నదని, అర్హులైన వారికి సంక్షేమ పధకాలు అందించడంలోపూర్తిగా విఫలం అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కొత్తకొండలో ఆ పార్టీ సమావేశం జరిగింది.

07/04/2016 - 23:47

సిరిసిల్ల, జూలై 4: సిరిసిల్ల ఆర్డీవోగా శ్యాంప్రసాద్‌లాల్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం సిరిసిల్ల ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన బానోతు భిక్షానాయక్ బదిలీపై వెళ్ళగా, బోధన్ ఆర్డీవోగా పని చేస్తున్న శ్యాంప్రసాద్‌లాల్‌ను గత మే 23న ప్రభుత్వం బదిలీ చేసింది.

07/04/2016 - 23:46

కోరుట్ల, జూలై 4: పట్టణంలోని స్వయంభూ సిద్ది వినాయక దేవాలయంలో సోమవారం వర్షాలు కురువాలని వరుణ జపం నిర్వహించారు. పాలెపు రాముశర్మ అధ్వర్యంలో నీటితొట్టిలో తొమ్మిది అర్చకులచే 10వేల వర్ణజపం నిర్వహించారు. ఈకార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హజరై వరుణ జపంలో పాల్గొన్నారు.

07/04/2016 - 23:46

మంథని,జూలై 4: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందు పరచినట్టు హైకోర్టు విభజన త్వరితగతిన చేపట్టాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథనిలో న్యాయవాదులు చేపడుతున్నా దిక్షకు శ్రీ్ధర్ బాబు సోమవారం మద్దతు పలికారు. ఈ సందర్బంగా శ్రీ్ధర్ బాబు మాట్లాడుతూ న్యాయధికారులపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసి వారిని కొనసాగించాలని ఆయన అన్నారు.

07/04/2016 - 23:45

సైదాపూర్, జూలై 4: సైదాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో 1బి, ఆన్‌లైన్ పహానీ, పిల్లల సర్ట్ఫికెట్లపై రెవెన్యూలో ఎలాంటి పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెవైఎం, బిజెపి, రైతుల ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

Pages