S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 23:59

గజపతినగరం, జూలై 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి 16కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెలుగు ప్రా ంతీయ సమన్వయకర్త కె. రాజేశ్వరి అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకు రూ.2.50కోట్లు రుణాలు అందజేశామని తెలిపారు.

07/04/2016 - 23:59

గంట్యాడ, జూలై 4: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిపూడి ఆదివారం పర్యాటకులతో కళకళాలాడింది. ప్రకృతి అందాలకు ప్రశాంత వాతావరణానికి నిలయమైన తాటిపూడి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పలు వాహనాలలో భారీగా తరలివచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇక్కడికి తరలివచ్చి సందడి చేశారు. తాటిపూడి జలాశయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బోటులో షికారుచేస్తూ ప్రకృతి అందాలు తిలకిస్తూ తన్మయం చెందారు.

07/04/2016 - 23:58

నెల్లిమర్ల, జూలై 4: మండలంలోని కొండవెలగాడలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 20మంది వరకు డయేరియాతో స్థానిక పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నెల్లిమర్ల సిహెచ్‌సికి తరలించారు. గ్రామంలోని మొయిదపేట ఎస్సీ కాలనీ, రెడ్డికవీధి వాసు లు డయేరియాతో పిహెచ్‌సిలో చేరారు. వెంటనే స్పందించిన వైద్యులు నాగరాజు రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

07/04/2016 - 23:58

గజపతినగరం, జూలై 4: మండలంలోని లోగిస గ్రామంలో నిర్మించిన సమీకృత వసతి గృహంతో మెంటాడ, గజపతినగరం మండలాలోని వసతి గృహాలు పూర్తిగా మూతపడడమే కాకుండా ఇ క్కడ పనిచేసిన వసతి గృహం సంక్షేమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులను అక్కడికి తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.

07/04/2016 - 23:57

వేపాడ, జూలై 4: మండలంలోని బల్లంకి పాల సంఘానికి నేడో,రేపో ఎన్నికలు జరిపేందుకు విశాఖ డెయిరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షు డు తాతారావు పదవీకాలం పూర్తికావడంతో నూతన పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించా ల్సి ఉంది. ముందుగా అధ్యక్షు డు ఎన్నిక జరగాల్సి ఉన్నందున ఈ పదవి కోసం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పోటీ పడుతుండడం విశేషం.

07/04/2016 - 23:57

గజపతినగరం, జూలై 4: శ్రీకాకుళంలోని కొవ్వాడలో నెలకొల్పనున్న అణువిద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఈనెల 17వతేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పురం అప్పారావు కోరారు. సోమవారం స్థానిక ఎన్‌జిఓ హోమ్‌లో సదస్సు గోడ పత్రికలను విడుదల చేశారు.

07/04/2016 - 23:55

సూర్యాపేటటౌన్, జూలై 4: తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోన గాంధీ విగ్రహం వద్ద డిఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా డిఈవో ముడుపులు తీసుకుంటున్నాడని ఆరోపించారు.

07/04/2016 - 23:55

నల్లగొండ, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని నల్లగొండ నుంచే ప్రారంభించేందుకు సిఎం కెసిఆర్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 8న రెండో విడత హరితహారాన్ని సిఎం కెసిఆర్ జిల్లా పరిధిలోని హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ధ మొక్కలు నాటి ప్రారంభించనున్నారు.

07/04/2016 - 23:54

నల్లగొండ రూరల్, జూలై 4: నల్లగొండ మండలంలో చారిత్రక ఆనవాళ్లైన ప్రాచీన సమాధులు రోజుకో గ్రామంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలోని వ్యవసాయ భూములలో అరుదుగా కనిపించే అతిపెద్ద మెన్‌హిర్ సమాధిని, సిస్త్ సమాధులను సోమవారం ఆంధ్రభూమి గుర్తించింది. గత రెండు వారాల నుండి ‘ఆంధ్రభూమి దినపత్రిక’ అప్పాజిపేటలోని బృహత్ శిలాయుగపు ఆనవాళ్లపై వరుస కథనాలు ప్రచురించిన విషయం విదితమే.

07/04/2016 - 23:53

నల్లగొండ టౌన్, జూలై 4: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఎం శ్రేణులు ప్రజాసమస్యలపై ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో రైతు సమస్యలు పెరిగిపోయాయని, కుల వృత్తులు, చేతి వృత్తులు కునారిల్లాయన్నారు.

Pages