S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 00:01

విజయనగరం(టౌన్),జూన్ 16: నీరు-చెట్టు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలోని పలు చెరువులను అభివృద్ధిచేసే పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చెరువు పనులను ఎమ్మెల్యే మీసాల గీత గురువారం పరిశీలించారు. పట్టణ పరిధిలోని కె. ఎల్.పురం, కణపాక ప్రాంతాల్లోని చెరువులు గుడిబండ, బుగతచెరువు, శివన్నచెరువు, మాన్యాలచెరువు, సీతమ్మచెరువు, చాకలి చెరువు, మహంతి చెరువులను ఆమె పరిశీలించారు.

06/17/2016 - 00:00

విజయనగరం (్ఫర్టు), జూన్ 16: విజయనగరం మున్సిపల్ ప్రజారోగ్యశాఖ విభాగంలో విచిత్రమైన పరిస్థితులు నెలకున్నాయి. చెత్తను రవాణా చేసే వాహనానికి పెద్దమొత్తంలో అద్దె చెల్లించడం, డీజిల్ ఖర్చులను మున్సిపాలిటీ భరించడంతో పలు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా విజయనగరం మున్సిపాలిటీలో ప్రైవేటు వాహనానికి అద్దె చెల్లింపు, డీజిల్ ఖర్చులను భరించడం వి స్మయం కలిగిస్తోంది.

06/17/2016 - 00:00

బొబ్బిలి, జూలై 16: స్థానిక రైల్వేస్టేషన్‌లో గూడ్స్ స్టోర్‌రూం వద్దకు రవాణాకు సంబంధించిన లారీలు రాకపోవడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైల్వే మేనేజర్ జిల్లా అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం డిఎస్పీ సౌమ్యలత, కమిషనర్ శంకరరావు, తహశీల్దార్ మసిలామణిలు పరిశీలించారు. ఈ సమస్యపై స్టేషన్ మాస్టార్‌ను అడిగి తెలుసుకున్నారు.

06/16/2016 - 23:58

నిజామాబాద్, జూన్ 16: పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోందని, ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పిలుపునిచ్చారు.

06/16/2016 - 23:57

కంఠేశ్వర్, జూన్ 16: విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని కోరుతూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ, ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులతో పాటు డోనేషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని అన్నారు.

06/16/2016 - 23:57

కామారెడ్డి, జూన్ 16: ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తుల ఆఫ్షన్‌ను వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగబోదని, ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దిరాములు అన్నారు. గురువారం న్యాయవాదుల రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు 11వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా కోర్టు ఆవరణలో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే న్యాయవాదుల భోజనాలు చేశారు.

06/16/2016 - 23:56

భిక్కనూరు, జూన్ 17: రాష్ట్ర వ్యాప్తంగా 41కోట్ల మొక్కలు నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర అటవిశాఖ మాత్యులు జోగురామన్న చెప్పారు. గురువారం నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన గల అంతంపల్లి నర్సరీని రాష్ట్ర అటవిశాఖ మంత్రి జోగురామన్న, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి పరిశీలించారు.

06/16/2016 - 23:55

మోర్తాడ్, జూన్ 16: దశాబ్దాలుగా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామ గ్రామస్థులు కంటున్న కలకు నేడు సాక్షాత్కారం ఏర్పడనుంది. 13కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న గుమ్మిర్యాల్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం భూమిపూజ చేయనున్నారు.

06/16/2016 - 23:54

వేములవాడ/వేములవాడ రూరల్, జూన్ 16: ‘రాష్ట్రంలోనే పుష్కలంగా జల వనరులున్నా కరీంనగర్ జిల్లాను కోనసీమలాగా పాడి పంటలతో సస్యశ్యామలం అయ్యేలా చేస్తాం.. ఎత్తిపోతల పథకం పనులను పూర్తి మెట్ట ప్రాంతంలోని సిరిసిల్ల చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు.

06/16/2016 - 23:53

కరీంనగర్ టౌన్, జూన్ 16: సుందర నగరాల రేసులో పాల్గొనేందుకు ఎన్నో మాసాలనుంచి ఎదురుచూస్తున్న కరీంనగర్‌కు ఎట్టకేలకు అవకాశం లభించింది. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ రాసిన లేఖకు ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆమోద ముద్ర వేస్తూ, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల ఎంపిక జాబితాలో చేర్చాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Pages