S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/16/2016 - 23:45

వరంగల్, జూన్ 16: అక్రమాలకు పాల్పడే ఈజిఎస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. గురువారం రాత్రి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగినా ఈజిఎస్, గ్రామీణాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజిఎస్ కోసం కేంద్రం నుండి వచ్చే ప్రతి పైసాను వినియోగించుకోవాలన్నారు.

06/16/2016 - 23:44

వరంగల్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రానికి సీమాంధ్ర న్యాయమూర్తుల కేటాయింపులను నిరసిస్తూ గురువారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వంటావార్పుతో నిరసన తెలిపారు. గత 11 రోజులుగా వివిధ పద్ధతుల్లో న్యాయవాదులు, తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులు ప్రతి రోజు కోర్టు హాలుకు వెళ్లి విధులను బహిష్కరిస్తున్నారు.

06/16/2016 - 23:43

పరకాల, జూన్ 16: వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 11 ద్విచక్ర వాహనాలను దొంగలించిన అరుగురు అంతర్ జిల్లా వాహన దొంగలను అరెస్టు చేసి వారి నుండి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు పంపినట్లు ములుగు ఎఎస్పీ విశ్వజిత్ కాంపాటి అన్నారు.

06/16/2016 - 23:43

వరంగల్, జూన్ 16: తెలంగాణలో రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని టిపిసిసి జనరల్ సెక్రెటరీ అజ్మత్ ఉల్లా అన్నారు. గురువారం మహేశ్వరి గార్డెన్‌లో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ తూర్పు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి జనరల్ సెక్రెటరీ అజ్మతుల్లా హాజరై మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామన్నారు.

06/16/2016 - 23:42

వరంగల్, జూన్ 16: టిటిడిపి నాయకులు ప్రాజెక్టుల బాటపట్టారు. గురువారం టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్‌లతో కూడిన బృందం ఏటూరునాగారంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు.

06/16/2016 - 23:42

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 16: జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి హామీ పనిని కల్పించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మండలంలోని ఫత్తేపూర్, చిన్నపెండ్యాలలో ఉపాధిహామీ పధకంలో భాగంగా చేపట్టిన ఇంకుడుగుంతలు, సేధ్యపుకుంటలు, నర్సరీ పెంపకాలతో ఆయా ఫోటో ఎగ్జిబిషన్‌ను గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి పరిశీలించారు.

06/16/2016 - 23:40

దామరచర్ల, జూన్ 16: మండలంలోని వాడపల్లి వద్దగల కృష్ణా, మూసి నదుల సంగమం వద్ద గల పుష్కరఘాట్లను ఏరియల్ సర్వే ద్వారా గురువారం రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. అంతకుముందు కృష్ణా, మూసి నదుల సంగమం వద్ద మిర్యాలగూడ రూరల్ సిఐ రవీందర్ ఒన్‌టౌన్ సిఐ పాండురంగారావు, ఎస్‌ఐ బివి.రాఘవులు హెలికాప్టర్‌కు సూచికగా సంగమం వద్ద జెండాలను ప్రదర్శించారు.

06/16/2016 - 23:40

భువనగిరి, జూన్ 16: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి దేవస్థానం అభివృద్దిపనులు వేగంగా చేపడుతున్నట్లుగా భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్‌ఎల్‌ఎ పైళ్ల శేఖర్‌రెడ్డిలు తెలిపారు. గురువారం ఆర్‌డిఒ కార్యాలయంలో రోడ్లు భవనాళశాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

06/16/2016 - 23:39

నల్లగొండ లీగల్, జూన్ 16: న్యాయాధికారుల కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసనలో భాగంగా వంటా వార్పు కార్యక్రమంలో సిపిఎం ప్రతినిధి బృందం పాల్గొని సంఘీభావం తెలిపి వారి నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపింది.

06/16/2016 - 23:38

నాగార్జునసాగర్, జూన్ 16: ఆగస్టు నెలలో వచ్చే కృష్ణాపుష్కరాలకు తరలివచ్చే పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి అంజన్‌కుమార్ తెలిపారు.

Pages