S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 01:14

విశాఖపట్నం, జూన్ 16: ఆర్టీసీ ప్రధా న కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికుల రిలే నిరాహారదీయలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ ఎన్‌ఎంయు రీజనల్ కార్యదర్శి పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఎంయు విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ప్రతినిధులతో సమావేశం జరిగింది.

06/17/2016 - 01:12

ఏలూరు, జూన్ 16: బదిలీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ అటు అధికారవర్గాల్లో కూడా మరింత ఉత్కంఠను రేపుతూ ముందుకు సాగుతోంది. ఇంతకుముందు ప్రకటించిన విధంగా చూస్తే గురువారం నాడు ఆప్షన్లు ఇచ్చినవారికి బదిలీల పోస్టులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే పనితీరును ఎవరికివారు స్వయంగా బేరీజు వేసుకునే విధంగా నిర్ణయాన్ని అమలుచేశారు.

06/17/2016 - 01:11

ఏలూరు, జూన్ 16: తాడేపల్లిగూడెం కేంద్రంగా టిడిపి, బిజెపిల మధ్య చోటుచేసుకున్న బేధాభిప్రాయం గురువారంనాటి సిఎం పంచాయితీతో ప్రశాంతంగా ముగిసింది. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్ర అగ్రహం, అసహనంతో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అవసరమైతే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడిన నేపధ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.

06/17/2016 - 01:11

ఏలూరు, జూన్ 16 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20వ తేదీన జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను అధికారులతో ఆయన సమీక్షించారు.

06/17/2016 - 01:10

ఏలూరు, జూన్ 16 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడవలసిన బాధ్యత వైద్యులపై వుండగా హైరిస్క్ కేసులను గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఆసుపత్రులకు తరలించి వైద్యులు చేతులు దుపుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ప్రశ్నించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

06/17/2016 - 01:10

భీమవరం, జూన్ 16: కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నాల్గవసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాజస్ధాన్ నుంచి ఆయన ఎంపికయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ విజయవాడలోని ఆత్యీయ అభినందన సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్టమ్రుఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కూడా హజరయ్యారు.

06/17/2016 - 01:09

భీమవరం, జూన్ 16: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం ఎల్‌హెచ్ టౌన్ ఆధ్వర్యంలో గన్నాబత్తుల తులసమ్మ, పెదతాత ఇండోర్ స్టేడియంలో పశ్చిమగోదావరి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెలక్షన్స్ గురువారం నిర్వహించారు.

06/17/2016 - 01:09

ఏలూరు, జూన్ 16: ఏలూరులోని సర్ సిఆర్‌ఆర్ విద్యాసంస్ధలను విద్యాహబ్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రప్రభుత్వం నుండి పలు వృత్తివిద్యాకోర్సులను, అవసరమైన నిధులను తీసుకువస్తామని ఎంపి మాగంటి బాబు తెలిపారు.

06/17/2016 - 01:08

భీమవరం, జూన్ 16: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ రూపొందించిన నూతన వెబ్ సైట్‌ను ఆమె ప్రారంభించారు.

06/17/2016 - 01:07

వీరవాసరం, జూన్ 16: వీరవాసరం మండలం కొణితివాడ పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను తహసీల్దార్ ఎంవి తిలక్ ఆదేశాల మేరకు గురువారం మూడు మట్టి ట్రాక్టర్లను సీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండలస్థాయి నాయకులు ఒకరు ముందస్తు అనుమతి లేకుండా మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ సుధీర్, విఆర్వో అలేఖ్యలు ట్రాక్టర్లను సీజ్ చేశారు.

Pages