S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/16/2016 - 23:52

ఎల్లారెడ్డిపేట, జూన్ 16: పల్లెల అభివృద్ధికి రహదారులు ముఖ్యమని టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అన్నారు. కరీంనగర్-నిజామాబాద్ జిల్లాలను కలిపే మండలంలోని మద్దిమల్ల సోమారిపేట, గుండారం అంతర్గత రహదారుల పనులను ఆయన గురువారం పరిశీలించారు. పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. రూ.5.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయని చెప్పారు.

06/16/2016 - 23:52

ముకరంపుర (కరీంనగర్), జూన్ 16: నగరంలోని మంకమ్మతోటకు చెందిన రేవెళ్ళి సాయిరాం (15) అనే పదవ తరగతి విద్యార్థి అదృశ్యమైన సంఘటనపై గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం బుదవారం సాయంత్రం మిత్రుని వద్ద హోం వర్క్ బుక్ తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయిన సాయిరాం గురువారం మద్యాహ్నం వరకు కూడా ఇంటికి చేరుకోలేదు.

06/16/2016 - 23:51

తిమ్మాపూర్, జూన్ 16: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్మించిన స్ర్తి శక్తి భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం డిప్యూటీ పద్మాదేవేందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు ఎంపిపి బూడిద ప్రేమలత, జడ్పీటిసి ఉల్లెంగుల పద్మ తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు స్ర్తి శక్తి భవనాన్ని ప్రారంభిస్తారని, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు జనరల్ బాడీ మీటింగ్‌లో హాజరవుతారని తెలిపారు.

06/16/2016 - 23:50

ఇబ్రహీంపట్నం, జూన్ 16: తక్కువ ధరకే ఆర్మీ కోటాలో కార్లు ఇప్పిస్తామని చెప్పి వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసగించి పారిపోయిన సాయిబాబా అనే వ్యక్తిపై ఆంధ్రభూమిలో వచ్చిన కథనంతో పోలీసులు అప్రమత్తమై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

06/16/2016 - 23:50

పెద్దపల్లి రూరల్, జూన్ 16: పట్టణ ప్రజల దాహార్తి తొందరలోనే తీరునుంది. ఎంతో కాలంగా తీవ్ర మంచి నీటి కొరతను ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సిద్దిపేటకు పైపులైన్ ద్వారా వెళ్తున్న నీటిని పెద్దపల్లికి మళ్లించడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయ.

06/16/2016 - 23:49

ఎలిగేడు, జూన్ 16: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

06/16/2016 - 23:49

కరీంనగర్, జూన్ 16: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గానూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీజనల్ వ్యాధులు, 108 సర్వీసులపై సమీక్షించారు.

06/16/2016 - 23:46

ములుగుటౌన్, జూన్ 16: నియోజకవర్గంలోని రైతులకు ఆయా బ్యాంకుల మేనేజర్లు సకాలంలో రుణాలు అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. గురువారం ములుగులోఆర్‌డిఒ చీమలపాటి మహేందర్‌జీ అధ్యక్షతన నియోజకవర్గంలోని అన్ని మండలాల బ్యాంకర్లతో సబ్సిడి రుణాలపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

06/16/2016 - 23:46

వడ్డేపల్లి, జూన్ 16: జిల్లాలో అర్హత కలిగిన కౌలు రైతులకు రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రుణ అర్హత కార్డులను కౌలు రైతులు సంబందిత సమీప బ్యాంకు బ్రాంచీలలో సమర్పిస్తూ రుణాలు పొందవచ్చు అని అన్నారు. బ్యాంకు అధికారులు రుణ అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాలు అందించాలని అధికారులను సూచించారు.

06/16/2016 - 23:45

పరకాల, జూన్ 16: గణపురంలోని కాకతీయుల గణపేశ్వరాలయ సముదాయం(కోటగుళ్ళ)ను త్వరలో అభివృద్ధి పర్చనున్నట్లు రాష్ట్ర పురవస్తు శాఖ డైరెక్టర్ విశాలక్ష్మి తెలిపారు. గురువారం కోటగుళ్ళ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మంజూరైన నిధులు రాష్ట్ర విభజన వల్ల ప్రభుత్వానికి జమ చేయబడినాయన్నారు.

Pages