S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 04:13

కాకినాడ, ఏప్రిల్ 30: జిల్లాలోని అన్ని పట్టణాల్లో జూన్ నెలాఖరుకు బహిరంగ మలవిసర్జన లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు ఏర్పాట్లు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేలా ఉద్యమస్థాయిలో పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

05/01/2016 - 04:13

పిఠాపురం, ఏప్రిల్ 30: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పలేదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు స్పష్టం చేశారు. శనివారం పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న ఆయన స్థానిక విలేఖరులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రత్యేక హోదాతో ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఆ మేరకు ఎపిని ఆదుకుంటామని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిపారు.

05/01/2016 - 04:12

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: రెండంకెల వృద్ధి దిశగా పశుసంవర్థక శాఖ పయనిస్తోందని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ యాళ్ల దొరబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవం రాష్టస్థ్రాయి వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దొరబాబు మాట్లాడుతూ పాడి ఉత్పత్తిలో రాష్ట్రం ఆరవ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో నాల్గవ స్థానంలోను, కోళ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉందన్నారు.

05/01/2016 - 04:10

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: ఆంధ్ర పార్టీల నేతలు రాజకీయ పబ్బం కోసం చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దీక్షకు దిగుతాననడం సిగ్గుమాలిన చర్య, దుర్మార్గమైన నిర్ణయమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/01/2016 - 04:06

చిన్నమండెం, ఏప్రిల్ 30: చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామ పంచాయతీలోని యర్రగుట్టవాండ్లపల్లెలో విద్యుదాఘాతానికి ఆరు ఇండ్లు దగ్ధమై రూ.4 లక్షలు నష్టం వచ్చినట్లు ఆర్‌ఐ స్రవంతి తెలిపారు. కరెంటు ఇండ్లపై వెళ్తున్నందున షార్ట్‌సర్క్యూట్ తగిలి రేకులకుంట మనోహర, ఈశ్వరయ్య, గంగులమ్మ, సుధాకర, గంగయ్య, శ్రీరాములులకు చెందిన ఆరు ఇండ్లతో పాటు చిన్నపరెడ్డికి చెందిన గడ్డివాము కాలిపోయినట్లు ఆమె తెలిపారు.

05/01/2016 - 04:06

కడప, ఏప్రిల్ 30: మాజీ మంత్రి, మైదుకూరు నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన ఖాజీపేటకు చేరుకుని అనుచరులతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో టిడిపి మైదుకూరు ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరుకు చేరుకుని తన అనుచరులతో సమావేశం కావడంతో మైదుకూరులో రాజకీయాలు వేడెక్కాయి.

05/01/2016 - 04:06

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని, అందుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ హెల్త్‌సిటీలో అపోలో గ్రూప్ రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన 250 పడకల ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు.

05/01/2016 - 04:05

కడప,ఏప్రిల్ 30: జిల్లాలో ఉష్ణోగ్రతలు శనివారం కూడా యథావిధిగా కొనసాగాయి. కడపలో 44.2సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 41,42 సెల్సియస్ డిగ్రీలుగా ఉంది. వేడి, వడగాలులు ఎక్కువగానే కన్పించాయి. వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నా జిల్లాలో ఎక్కడా వర్షం కురిసిన దాఖలాలు లేవు.
సాలాబాద్‌లో ఒకరు

05/01/2016 - 04:04

కడప,ఏప్రిల్ 30: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కెవి రమణ ఆదేశించారు. శనివారం స్థానిక సభాభవన్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత జనవరి 30-2016వ తేదిన జరిగిన గత మాసంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు.

05/01/2016 - 04:04

కడప, ఏప్రిల్ 30: కాలుష్య సంబంధమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డా.్ఫణికుమార్ పేర్కొన్నారు.

Pages