S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 04:03

రాయచోటి, ఏప్రిల్ 30: మండల పరిధిలోని కంచాలమ్మ చెరువులో గుర్తు తెలియన వ్యక్తులు విషద్రావణం కలిపారని నీటి సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, కాంట్రాక్టర్ రెడ్డెయ్యలు స్థానిక అర్బన్ సిఐ శ్యామ్‌రావ్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

05/01/2016 - 04:02

కడప, ఏప్రిల్ 30: జిల్లాలో వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘాల్లో బినామీ పేర్లతో పలువురి నేతలు సుమారు రూ.50కోట్లు పైబడి స్వాహా చేసినట్లు సిఐడి తేల్చింది. జిల్లావ్యాప్తంగా 62 సహకార సంఘాలు ఉండగా, ఇందులో 50సంఘాల పైబడి గతంలో ఆ సంఘాల్లో పాలకవర్గ సభ్యులుగా పనిచేసిన వారు దొరికిన కాడికి దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. రుణమాఫీ పుణ్యమా అని రుణాలు తీసుకున్న బినామీ నేతలంతా మాఫీలో పోతుందని ఆనందపడ్డారు.

05/01/2016 - 04:02

కడప, ఏప్రిల్ 30: యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య భేతనభట్ల శ్యామ్‌సుందర్ పదవీకాలం మరో రెండునెలల్లో ముగియనుండటంతో విసి పదవి కోసం పలువురు అధ్యాపకులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. విసి శ్యాంసుందర్ సైతం పదవి పొడిగింపు కోసం ప్రయత్నించడం లేదు. ఆయన హయాంలోనే వైవియుకు నాక్ బిగ్రేడ్ గుర్తింపు లభించింది.

05/01/2016 - 04:01

కడప,ఏప్రిల్ 30: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమకాలికులందరూ టిడిపి గూటికి చేరుతున్నారు. కడప జిల్లాలో గతంలో దివంగత నేతకు ఎంతో సన్నిహితంగా ఉన్న నాయకుల్లో పలువురు కొంతకాలం ఆయన తనయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ, అక్కడ ఇమడలేక బయటకు వచ్చేస్తున్నారు. మొదటినుంచీ వైకాపాకు దూరంగా ఉన్న మరికొందరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.

05/01/2016 - 03:56

గుంటూరు, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రహదారుల చక్రబంధంలో ఇరుక్కోనుంది. అందుబాటులో జాతీయ రహదారులు ఉన్నప్పటికీ అనాలోచిత నిర్ణయాల కారణంగా వందల కోట్ల రూపాయల వృథా ఖర్చుతోపాటు భవిష్యత్తు ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిణమించే నిర్ణయాలతో డిజైన్లు రూపొందిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ప్రాంత, నగర, సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లను సింగపూర్ సర్బానో జురాంగ సంస్థ అందించింది.

05/01/2016 - 03:53

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30: పాలేరు నియోజకవర్గంలో 1962 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13సార్లు ఎన్నికలు నిర్వహించగా పదిసార్లు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తోంది. రెండుసార్లు సిపిఎం, ఒకసారి సిపిఐ పార్టీలు విజయాన్ని సాధించి తమ ఉనికిని చాటుకున్నాయి. 1962 నుంచి 2004 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు.

05/01/2016 - 03:53

ఖమ్మం, ఏప్రిల్ 30: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 14మంది బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన శనివారం చేసిన అధికారులు రెండు నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సిపిఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బత్తుల లెనిన్‌ల దరఖాస్తులను తిరస్కరించారు. ఏ,బి ఫారాలను జత చేయని కారణంగా తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

05/01/2016 - 03:52

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఏమైనా అక్రమాలు, ఎన్నికల ప్రవర్తనా నియావళి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08742-238222కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ దానకిషోర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

05/01/2016 - 03:51

చర్ల, ఏప్రిల్ 30: చర్ల మండలం బోదనెల్లికి చెందిన కుంజం బుజ్జిబాబు, పొడియం సారయ్యలు ఎవరికీ ఏ హానీ తలపెట్టే వారు కాదని, మావోయిస్టులు మరోసారి ఆలోచించి సహృదయంతో వారిని విడిచి పెట్టాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు బోదనెల్లి గ్రామస్తులు మావోయిస్టు పార్టీని వేడుకుంటున్నారు. గిరిజనులను కిడ్నాప్ చేసిన సందర్భంగా అక్కడ గ్రామానికి వెళ్లిన విలేఖర్లతో అక్కడి గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

05/01/2016 - 03:51

హైదరాబాద్, ఏప్రిల్ 30: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన 7.5 టన్నుల బంగారాన్ని పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నామని తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

Pages