S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 04:27

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక ఇసుకవీధిలో కొద్ది రోజుల క్రితం ఓ భవనం కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గిరిష్మాకు శనివారం స్థానిక ఎలైట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, డాక్టర్ మురహరి, డాక్టర్ బాబురావు బృందం ఆమెకు శస్తచ్రికిత్స చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గిరిష్మా వెనె్నముకకు బలమైన గాయమైందని అన్నారు.

05/01/2016 - 04:27

విశాఖపట్నం, ఏప్రిల్ 30: కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీ, వినియోగానికి కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల సిఎంలతో కూడిన అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అపెక్స్‌బాడీ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు.

05/01/2016 - 04:27

తిరుపతి, ఏప్రిల్ 30: ఎస్వీయూనివర్శిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డికి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకమైన కీర్తి పురస్కారం ప్రకటించింది. మే నెలలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పలు దినపత్రికల్లో పేటశ్రీ రచించిన తిరుపతి కథలకు ఆథ్యాత్మికం విభాగంలో ఈపురస్కారం లభించింది. ఆయన ఇప్పటి వరకు 16 అవార్డులు అందుకోవడం గమనార్హం.

05/01/2016 - 04:26

తిరుపతి, ఏప్రిల్ 30: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు చేపడుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను విదేశాల్లో నిర్వహించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు టిటిడి సంయుక్త కార్యనిర్వాహణాధికారి పోలాభాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తన చాంబర్‌లో శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

05/01/2016 - 04:26

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 30: లోలోపల ఉండిన టిడిపి అసమ్మతి కౌన్సిలర్ల వివాదం శనివారం బహిరంగంగా మారింది. టిడిపికి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్‌పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు దాడికి ప్రయత్నించి సంచలనం రేపారు. మునిసిపల్ సర్వసభ్యసమావేశం శనివారం ఉదయం చైర్‌పర్సన్ పేట రాధారెడ్డి అధ్యక్షతన జరిగింది.

05/01/2016 - 04:25

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆదాయం సమకూర్చుకునే విధంగా మెప్మా సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర సెర్ప సి ఇ ఓ స్మాలన్ ఆరోఖ్య రాజ్ అన్నారు. శనివారం స్థానిక ప్రైవేట్ హోటల్లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మెప్మా అధికారులతో వివిధ మున్సిపాలిటీల్లో జీవనోపాదుల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.హెచ్.జి., ఎస్ ఎల్.

05/01/2016 - 04:24

తిరుపతి, ఏప్రిల్ 30: సమాజాన్ని ముందుకు నడిపించే కథలు రావాలని అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ యువ రచయితలకు పిలుపునిచ్చారు. స్థానిక వరదరాజనగర్‌లోని జె.సి.ఆర్. చైతన్య పాఠశాల్లో యువ కథారచయితలకు కథలబడి కార్యశాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 40మంది యువ కథ రచయితలకు రెండురోజులపాటు కథాసాహిత్యంపై శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

05/01/2016 - 04:24

తిరుపతి, ఏప్రిల్ 30: శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక అన్నమాచార్య కళామందిరంలో శనివారం సాయంత్రం అన్నమయ్య హరికొలువు సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి, ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఒ మునిరత్నం రెడ్డి ఈ సిడిలను ఆవిష్కరించారు.

05/01/2016 - 04:23

తిరుమల, ఏప్రిల్ 30: తిరుమల్లో సంచలనాలకు దారి తీసిన పుష్పగిరి మఠం అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని తిరుమల డిఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఆయన శనివారం తమ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్పగిరిమఠానికి సంబంధించిన నిర్వహణ, అవకతవకలపై మఠం యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు.

05/01/2016 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఆంధ్రనోట మట్టికొట్టే తెలంగాణకు చెందిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల దీక్షకు ఉపక్రమిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 16నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు.

Pages