S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 01:10

గోపాలపురం, ఏప్రిల్ 12: ప్రాచీన హిందూ సంస్కృతీ, సాంప్రదాయాలను పరిరక్షించేది పురాతన దేవాలయాలేనని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. గోపాలపురంలో మంగళవారం శ్రీ సీతారామస్వామి, వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

04/13/2016 - 01:09

చాగల్లు, ఏప్రిల్ 12: రైతాంగ సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా డిసిసిబి, దాని అనుబంధ సంఘాలు కృషి చేస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఊనగట్ల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గిడ్డంగి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముత్యాల స్థానిక విలేఖర్లతో మాట్లాడారు.

04/13/2016 - 01:08

కుకునూరు, ఏప్రిల్ 12: విలీన మండలం కుకునూరు మండలంలో ముఖ్యమంత్రి మహాసభ పూర్తిస్థాయిలో ముస్తాబైంది.

04/13/2016 - 01:08

పాలకొల్లు, ఏప్రిల్ 12: ప్రజలకు ఉచితంగా ఇసుక ప్రయోజనం చేరేలా చూడటానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక తెచ్చుకునేందుకు వీలు కల్పించినా దళారుల గుప్పెట్లోకి తీసుకోవడంతో ధర తగ్గలేదని ప్రజల నుండి నిరసనలు వెలువెత్తుతున్నాయి.

04/13/2016 - 01:07

ఏలూరు, ఏప్రిల్ 12 : జిల్లాలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ఎన్‌టి ఆర్ గృహ పధకం కింద పేదలకు 1200 కోట్ల రూపాయల వ్యయంతో 5 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ డిఇ పి రఘురామ్‌కుమార్ చెప్పారు. స్థానిక గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకం అమలు తీరుపై అధికారులతో ఆయన చర్చించారు.

04/13/2016 - 01:06

పెదవేగి, ఏప్రిల్ 12: జిల్లాలో పోలవరం కుడికాల్వ పనులు మే 3వ వారంలోగా పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వ పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు.

04/13/2016 - 01:06

పెంటపాడు, ఏప్రిల్ 12: గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే అధికారులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గత రెండురోజులపాటు స్మార్ట్ విలేజ్‌లపై అవగాహనా సదస్సు జరగ్గా, దానిపై మంత్రి స్థానిక ఎంపిపి కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/13/2016 - 01:05

ఏలూరు, ఏప్రిల్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కుకునూరులో విస్తృతంగా పర్యటించి పలు శంకుస్థాపన కార్యక్రమాలతోపాటు పేదలకు రుణాలు, పెన్షన్లు అందించే బృహత్తర కార్యక్రమాలలో పాల్గొంటారు. కుకునూరులో 32లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే 108 ఇళ్ల కాలనీకి ఆయన శంకుస్థాపన చేస్తారు. నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. 550 మందికి పెన్షన్లను పంపిణీ చేస్తారు.

04/13/2016 - 01:03

మడకశిర, ఏప్రిల్ 12: మండల పరిధిలోని కోతులగుట్టకు చెందిన జ్యోతి (18) మంగళవారం సాయంత్రం బావిలో పడి మృతి చెందింది. జ్యోతి వరి పొలం కోసేందుకు కూలి పనులకు వెళ్ళింది. సాయంత్రం 4 గంటల సమయంలో చింతచెట్టులో ఉన్న తేనె తొట్టెకు కొందరు రాళ్లు విసరడంతో తేనెటీగలు కూలీలపై దాడి చేశాయి. దీంతో వాటి బారి నుండి తప్పించుకొనేందుకు పరుగులు తీసిన జ్యోతి రహదారి ప్రక్కనే ఉన్న బావిలోకి పడిపోయింది.

04/13/2016 - 01:03

ధర్మవరం, ఏప్రిల్ 12: పట్టణంలో మంగళవారం నేతన్న తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మహాత్మాగాంధీ కాలనీకి చెందిన శంకర్‌ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు గతంలో సొంతం మగ్గం నేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో సొంత మగ్గాన్ని అటకెక్కించి కూలి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Pages