S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 00:35

వరంగల్, ఏప్రిల్ 12: భానుడు పగబట్టాడు. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వరంగల్ అగ్నిగుండంగా మారింది. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. బలమైన వేడి గాలులతో జనం విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు మరింత ఎక్కువై రోడ్లపై జనాలు తిరగడం లేదు. వరంగల్ నగరమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది.

04/13/2016 - 00:22

‘ఈ పురస్కారం నాకు ఎంతో సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది.’’దక్షిణాది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో వ్యక్తంచేసిన మాటలు. మంగళవారంనాడు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ...ప్రజలు నా కష్టాన్ని గుర్తిచినందుకు కృతజ్ఞతలు అని పేర్కొంది.

04/12/2016 - 23:54

కంఠేశ్వర్, ఏప్రిల్ 12: జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడినందున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సద్వినియోగం అయ్యే విధంగా అధికారులు కృషి చేయాలని నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్‌పర్సన్, జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

04/12/2016 - 23:54

నిజామాబాద్, ఏప్రిల్ 12: పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయిన రైతాంగానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఇన్‌పుట్ సబ్సిడీని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు.

04/12/2016 - 23:53

నవీపేట, ఏప్రిల్ 12: నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 9వ వార్డు మెంబర్ నవీన్‌రాజ్ మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం గది ముందు కింద పడుకుని నిరసన తెలిపారు.

04/12/2016 - 23:53

కంఠేశ్వర్, ఏప్రిల్ 12: నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా భూమిపూజ నిర్వహించారు. నగరంలోని 22వ డివిజన్ హైమద్‌పుర కాలనీలో 10లక్షల రూపాయల సాధారణ నిధులతో సిసి డ్రైనేజీ పనులకు, 37, 38వ డివిజన్లయిన ఆటోనగర్‌లో 15లక్షల సాధారణ నిధులతో సిసి డ్రైనేజీ, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

04/12/2016 - 23:52

కామారెడ్డి, ఏప్రిల్ 12: భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతోగొప్పవని, వాటిని ఆచరించడం వల్ల అంతా మంచే జరుగుతోందని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజి అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ఎన్‌జిఒస్ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరైయ్యారు.

04/12/2016 - 23:52

నిజామాబాద్, ఏప్రిల్ 12: బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో తెలంగాణలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రముఖ కంపెనీలతో పాటు ఎంతోమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

04/12/2016 - 23:49

నారాయణఖేడ్ ఏప్రిల్ 12: మనూరు మండలం కర్ణాటక సరి హద్దు అయిన ఇరక్‌పల్లి గ్రామం నుంచి జంబ్గి గ్రామం మధ్యన వాగుపై వంతెన నిర్మిస్తే సులభంగా బీదర్ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని మంగళవారంనాడు స్థానిక ఎమ్మెల్యే ఎం.్భపాల్‌రెడ్డి, జడ్పీసిఇవో వర్షిణీ వాగును పరిశీలించారు.

04/12/2016 - 23:49

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నప్పటికి నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కరవుబారిన పడిన జిల్లా ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు.

Pages