S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2016 - 13:04

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జాతీయ రహదారి పక్కన భాగ్యనగర్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. గ్యాస్‌ లీకవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తున్నారు.

01/14/2016 - 13:04

హైదరాబాద్ : సంక్రాంతి సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ సంబురాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రైట్ టు ఓట్ ఛాంపియన్‌ను ప్రారంభించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు పతంగుల పండుగలో పాల్గొన్నారు.

01/14/2016 - 12:52

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతిచెందారు. సిక్కిం- డార్జిలింగ్‌ సరిహద్దులోని 10వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల నుంచి ఓ చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

01/14/2016 - 12:48

హైదరాబాద్‌: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శి అబ్దుల్‌ రహీమ్‌ ఖురేషి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు రహీం ఖురేషి మృతిపట్ల సంతాపం తెలిపారు.

01/14/2016 - 12:46

న్యూఢిల్లీ : : దేశ రాజధాని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి-బేసి వాహన నిబంధనను రద్దు చేయబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సరి-బేసి విధానాన్ని నిలిపివేయాలంటూ ఓ లాయర్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. లాయర్‌ అప్పీల్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి నగరవాసులు మద్దతివ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ కోరారు.

01/14/2016 - 12:42

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు.తెలంగాణలో టీ.టీడీపీ నేతలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మీయ కలయిక పేరిట నియోజకవర్గంలో తలపెట్టిన కార్యక్రమానికి నాందిగా ఎన్టీఆర్ భవన్‌లో మోత్కుపల్లి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

01/14/2016 - 12:35

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మురుమళ్ల గ్రామంలో ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు కోడిపందేలను ప్రారంభించారు.

01/14/2016 - 12:24

బీజింగ్ : చైనాలోని జీజాంగ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయ్యింది. లుంటాయ్ రాష్ట్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

01/14/2016 - 11:51

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు టిఆర్‌ఎస్ నేతలు తమ వ్యూహానికి పదును పెడుతున్నారు. గురువారం ఉదయం టిఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ ప్రచార వ్యూహంపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కసరత్తు పూర్తి కావస్తోంది. సమావేశంలో కడియం శ్రీహరి, కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

01/14/2016 - 11:50

విజయవాడ: రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా సంక్రాంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకొని, ఆనందోత్సాహాలు పంచుకోవాలని ఎ.పి సి.ఎం. చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరియాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

Pages