S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2016 - 08:30

హైదరాబాద్, జనవరి 13: తెలిసీ తెలియని వయసులో తల్లికి దూరమైన ఇద్దరు పిల్లలు పెద్దయ్యారు. తల్లి ప్రేమను కావాలనుకున్న ఆ యవతులు సౌదీ నుంచి పాతబస్తీకి చేరుకున్నారు. తల్లి ప్రేమకు దూరమైన ఆ ఇద్దరు యువతులకు పోలీసులు అండగా నిలిచి వెతకడం ప్రారంభించారు. సినిమా కథను తలపించే వీరి యదార్థగాథ వివరాల్లోకి వెళితే..

01/14/2016 - 08:29

విజయవాడ (క్రైం), జనవరి 13: కల్తీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈమేరకు విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక స్వర్ణ బార్‌లో మద్యం సేవించి గత ఏడాది డిసెంబర్ 7న ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

01/14/2016 - 08:29

కాకినాడ, జనవరి 13: ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఎస్ అచ్యుతాపురం గ్రామంలో నివసిస్తున్న డాక్టర్ అద్దేపల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కాకినాడ స్థిరపడిన అద్దేపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా బందరు.

01/14/2016 - 08:26

హైదరాబాద్, జనవరి 13: నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ స్టాక్ మార్కెట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎక్స్‌పర్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. స్టాక్ మార్కెట్‌లో పెట్డుబడులతో అధిక లాభాలు గడించొచ్చని నమ్మించి ప్రజలకు సుమారు 4కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టింది.

01/14/2016 - 08:25

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజి విద్యుత్ పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నారు. సామర్థ్యంలేని పంపుసెట్లను మార్చి వాటి స్థానంలో నాణ్యమైనవి అమర్చి, విద్యుత్‌ను ఆదాచేయడం ఈ పథకం లక్ష్యం. ఇది నిజంగా రైతులకు శుభవార్తే. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ మంజూరు చేసిన రూ.294.75 కోట్లతో మొదట దీనిని ప్రారంభిస్తారు.

01/14/2016 - 08:19

సంగారెడ్డి, జనవరి 13: ధనుర్మాసంలో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ పరిధిలోని వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నాడు స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మూడు రోజులుగా పట్టణంలో మార్మోగుతున్న స్వామి వారి నామస్మరణ కల్యాణం రోజున భక్తులు మరింతగా పులకించిపోయారు.

01/14/2016 - 08:18

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర సమితి దళితులను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే భారతీయ జోకర్ పార్టీ అని విమర్శించిన రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడలేమని అన్నారు.

01/14/2016 - 08:17

మహబూబ్‌నగర్, జనవరి 13: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను రూపొందిస్తున్నామని, జాబితా పూర్తి కాగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ త్వరతగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు.

01/14/2016 - 08:16

చౌటుప్పల్, జనవరి 13: సంక్రాంతి పండుగ పర్వదినం వేడుకల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తుండఆంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లాలో వాహనాల రద్దీ బుధవారం సాయంత్రం మరింత పెరిగింది. ఈ నెల 14, 15, 16 తేదీలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు ఆంధ్రకు పయనమవడంతో హైవేపై అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

01/14/2016 - 08:15

హైదరాబాద్, జనవరి 13: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పాతబస్తీలో అధిక శాతం డివిజన్లు రిజర్వ్ కావడంతో విజయంపై ఆలిండియా మజ్లిస్ ఇఫ్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తర్జన భర్జన పడుతోంది. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో మజ్లిస్‌కు సొంత గడ్డపై ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.

Pages