S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2016 - 18:00

పెన్నుకి పెన్సిల్‌కి తేడా ఉంది. పెన్సిల్‌ని తరచూ పదును చేసుకోవాల్సి ఉంటుంది. అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. పెన్ను అలా కాదు. సిరా అయిపోతే మళ్లీ పోసుకోవచ్చు.
పెన్సిల్‌ని చూసినప్పుడు నాకు మనిషి గుర్తుకొస్తాడు. మనిషి కూడా పెన్సిల్‌లా మారాలి. అరిగిపోయినప్పుడల్లా తనని తాను పదును చేసుకోవాలి. ఆ విధంగా పదును చేసుకుంటేనే పెన్సిల్‌లా బొమ్మలు గీయగలడు. రాయగలడు.

01/14/2016 - 17:59

పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లడం ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతూనే ఉంది. ఇండియా నించి దుబాయ్‌కి, బంగ్లాదేశ్ నించి ఇండియాకి కూలీలు వలస వెళ్తూంటారు. ఇలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా యూరప్‌కి వలస వెళ్తున్నారు. కాని వారి సంఖ్య తక్కువ.

01/14/2016 - 17:58

ఇప్పుడు మనకు దొరుకుతున్న వజ్రాల వయసెంతో తెలుసా. కనీసం 350 మిలియన్ సంవత్సరాలు. భూమిలోపల 192 కి.మీ. అడుగున విపరీతమైన ఒత్తిడి, వేడి మధ్య కర్బన పదార్థాలే వజ్రాలుగా రూపొందుతాయి. భూమిలోపల అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా లావా ఉప్పొంగినపుడు భూమి పైపొరల్లోకి వస్తాయి. తవ్వకాల్లో వాటిని బయటకు తీస్తారు. ఒక కారెట్ వజ్రం ఉత్పత్తి చేయడానికి 250 టన్నుల మట్టిని తవ్విపోయాలి తెలుసా.

01/14/2016 - 17:57

‘సార్! నేను మీ అభిమానిని. సినిమాల్లో నటించాలని వచ్చాను. ఒకసారి నా ఫొటో ఆల్బమ్ చూడండి. వీలయితే అవకాశం ఇవ్వండి...’ అన్నాను.
‘అడ్డమయిన వాళ్లకీ ఇవ్వటానికి ఇక్కడ వేషాలు గుట్టలుగా పోగేసుకుని కూర్చున్నామటమ్మా! పోవమ్మా! పోయి వేరే పని చూసుకో...’ అన్నాడతను.
‘ఒక్కసారి ఆల్బమ్ చూడండి సార్...’ అతని ముందుకు ఆల్బమ్ జరుపుతూ అన్నాను.

01/14/2016 - 17:55

‘‘ఇటీవల బాలీవుడ్ భామలపై వస్తున్నన్ని రూమర్స్ మరే తారలపై రావడం లేదు. కారణాలు ఏమైనా రూమర్స్ అనేవి ఒక ఫ్యాషన్‌లా తయారైపోయాయి. ఇలా చేయకుంటే మీడియా నెగ్గుకు రావడం లేదేమో’’అంటూ గట్టిగానే స్టేట్‌మెంట్ ఇచ్చింది బాలీవుడ్ భామ దీపికాపదుకొనే. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో దీపికాను చుట్టిముట్టిన మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది.

01/14/2016 - 17:53

వైన్ తాగడంలో కొత్తేముంది. వైన్‌లా కన్పించే వేడినీళ్లలో కూర్చుని అసలైన వైన్ తాగితేనే మజా అంటున్నారు ఈ అతివలు. టోక్యోలోని కోవాకిచన్ ఎన్స్‌న్ స్పాలో ఈ తరహా ఏర్పాట్లు చేశారు. రెడ్‌హాట్‌వాటర్ టబ్స్‌లో కూర్చుని వైన్ తాగితే అదో గమ్మత్తయిన అనుభవం అంటూ వినియోగదారులను ఆ స్పా ఆకర్షిస్తోంది. వైన్ ప్రారంభోత్సవం అనే వేడుక సందర్భంగా ఈ ఆఫర్‌ను ఆ స్పా ప్రకటించింది.

01/14/2016 - 17:49

పెదవులపై చిరునవ్వును పూసుకొని
పలుకరించి ఆత్మీయతను అభినయిస్తారు
మనం ఇచ్చే ఆతిథ్యపు తేనీటిని
సేవిస్తూ ఉపరాగ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు
వారి కవితా వదూటిపై
మనం ప్రశంసాపూర్వక జల్లు కురిపిస్తాం
మన అభినందనకు ఉబ్బితబ్బిబ్బై
వొకింత గుర్వోన్మత్తులౌతారు
అహం ఆవహించి ఆకాశం దాకా పయనిస్తారు
అప్పుడప్పుడూ వారి ఆర్థిక సమస్యల పరిష్కారానికి

01/14/2016 - 13:24

ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెలం, జీలుగుమిల్లిలో ఇప్పటికే కోడిపందాలు ప్రారంభమైయ్యాయి. భీమవరంలో కోడి పందాలను బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. తణుకు మండలం తేతలిలో కోడిపందాలు జరిగాయి. పోలీసులు వారించినా నిర్వాహకులు పట్టించుకోలేదు. అత్యంత కోలాహలం మధ్య కోడిపందాలు సాగాయి.

01/14/2016 - 13:10

ఆస్ట్రేలియా: డబ్ల్యూటీ సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మెరిసిపోయారు. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 4-6, 6-3, 10-8 స్కోర్ తో సానియా-హింగీస్ జోడీ గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. ఓలారు, స్వెదొవా జోడీపై గెలుపొందారు. 29 వరుస విజయాలతో సానియా-జోడీ ప్రపంచ రికార్డు సృష్టించారు.

01/14/2016 - 13:05

హైదరాబాద్‌: సంక్రాంతి సంబురాలను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో అగాఖాన్‌ అకాడమీ ప్రాంగణంలో రెండు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగను తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌ ప్రారంభించారు.

Pages