S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2015 - 04:12

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 19: జలమండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ యువర్, డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీనెల మూడవ శనివారంనాడు సాయంత్రం ఖైర్‌తాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో మీట్, డయల్ యువర్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కార్యక్రమం నిర్వహించారు.

12/20/2015 - 04:10

* లాస్ వెగాస్: యుఎఫ్‌సి 194 ఫెదర్‌వెయిట్ టైటిల్‌ను కానర్ మెక్‌గ్రెగర్ గెల్చుకున్నాడు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేకపోయినా, జోస్ ఆల్డోను అతను కేవలం 13 సెకన్లలో నాకౌట్ చేయడం విశేషమే. ప్రేక్షకులు ఇంకా కుర్చీల్లో సరిగ్గా కూర్చోక ముందే, ఫైటర్లు రింగ్‌లోకి అడుగుపెట్టినందుకు కొడుతున్న కేరింతల నుంచి స్టేడియం కోలుకోకముందే ఫైట్ ముగిసింది.

12/20/2015 - 04:08

అజేయుడిగా కెరీర్ నుంచి వైదొలగిన ఫ్లోయిడ్ మేవెదర్ ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. వివిధ దేశాలను తిరుగుతూ, అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ఆనందిస్తున్నాడు. వ్యక్తిగత సహాయకురాలు కిచీతో కలిసి ఇటీవలే రోమ్‌ను సందర్శించిన అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చేరుకున్నాడు. అక్కడ అరబ్ షేక్ దుస్తులు వేసుకొని, వారిలో ఒకడిగా కలిసిపోయాడు.

12/20/2015 - 04:07

భారత జాతీయ సెలక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్నది నిన్నమొన్నటి విమర్శకాదు. ఒక రకంగా మన దేశంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. చాలా మంది ఆటగాళ్లను వివిధ టూర్లకు తీసుకెళ్లడం, వారితో ఒక్క మ్యాచ్‌ని కూడా ఆడించకుండానే ఉద్వాసన పలకడం భారత సెలక్టర్ల అలవాటు. అసమాన ప్రతిభతో రాణించినప్పటికీ ఎన్నోసార్లు ఉద్వాసనకు గురైన మొహీందర్ అమర్‌నాథ్ కడుపుమండి సెలక్టర్లను ‘జోకర్ల గుంపు’గా అభివర్ణించాడు.

12/20/2015 - 04:07

భారత క్రికెట్‌లో బౌలింగ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది స్పిన్. ప్రపంచానికి స్పిన్ బౌలింగ్ బలాన్ని పరిచయం చేసిన ఘనత భారత్‌కే దక్కుతుంది. ఎంతో మంది మేటి స్పిన్నర్లను మన దేశం క్రికెట్‌కు అందించింది. 1970 దశకంలో ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ భారత స్పిన్ సామర్థ్యాన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలకు రుచి చూపించారు. వీరిని ఎదుర్కోవడానికి మేటి బ్యాట్స్‌మెన్ కూడా భయపడేవారు.

12/20/2015 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 19: రబీలో పంటవేసి బ్యాంకు రుణాలు పొందని రైతుల వివరాలను బ్యాంకర్లకు అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో పంట రుమాల పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/20/2015 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 19: గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణకు కాస్త ఆలస్యమైనా, క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సర్కారు భవనాలు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలను ప్రవేశపెట్టిన 19 రోజుల్లో అన్ని సర్కిళ్లలో కలిపి సుమారు 27629 దరఖాస్తులు అందాయి.

12/20/2015 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 19: రాజధానిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం పశ్చిమ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 400మంది పోలీసులు దాడులు నిర్వహించారు. జియాగూడ, భవానీనగర్‌లలో తనిఖీలు చేపట్టారు. 13మంది రౌడీషీటర్లను, 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌనె్సలింగ్ నిర్వహించి అనుమానితులను విచారిస్తున్నారు.

12/20/2015 - 04:03

హైదరాబాద్, డిసెంబర్ 19: సికిందరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఏటిఎంలో ఓ దుండగుడు చోరీకి విఫల యత్నం చేశాడు. రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఈ బ్యాంకులో శుక్రవారం అర్ధరాత్రి ఓ దుండగుడు బ్యాంక్ భవనం పైకప్పుకు కన్నం వేశాడు. గదిలోకి దూరే యత్నంలో ముంబయిలోని ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అలారం మోగింది.

12/20/2015 - 04:02

హైదరాబాద్, డిసెంబర్ 19: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండే రెండు లక్ష్యాలతో పావులు కదుపుతోంది. స్వరాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గ్రేటర్‌పై గులాబీ జెండాలను ఎగురవేయాలన్న లక్ష్యం ఒకటి కాగా, నగరంలో ఎక్కువ ప్రాబల్యం కల్గిన మజ్లిస్‌తో పాటు ఇతర పార్టీలన్నింటి కన్నా ఒక్క సీటునైనా ఎక్కువగా గెలిచి సత్తా చూపే దిశగా ఆ పార్టీ వ్యూహన్ని సిద్ధం చేస్తోంది.

Pages