S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 18:38

ముద్దొచ్చే చిన్నకారు చూడటానికి, ప్రయాణించడానికి అందంగా, సౌకర్యంగానే ఉంటుంది. కానీ మనిషి ఆరోగ్యంపై ఇప్పుడు వాటివల్లే ‘కారు’మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ పరిణామం ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఆ మబ్బుల్ని తొలగించే పనిలో పడింది ఈ లోకం. ‘కారు లేని లోకం’లో భయంలేని బతుకుకోసం తపిస్తోంది. అందుకే ‘కార్ ఫ్రీ’ ప్రాంతాల పేరుతో కాలుష్యం కాటేయని రూట్‌కోసం అంతా వెతుకుతున్నారు.

12/19/2015 - 18:46

నార్మన్ లోగన్ ఏపిల్ పై, కాఫీలకి డబ్బు చెల్లించి తన ట్రేతో కేఫ్టీరియాలోని ఓ టేబుల్ ముందుకి వెళ్లి కూర్చున్నారు. అతనికి దూరంగా ఉన్న విలియం కనపడ్డాడు. వెంటనే నార్మన్ లేచి విలియం టేబుల్ దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘నేను ఇక్కడ కూర్చోవచ్చా?’
కేష్ కౌంటర్‌లోంచి తలెత్తి చూసినట్లుగానే విలియం తలెత్తి అతని వంక చాలా మామూలుగా చూసి చెప్పాడు.

12/19/2015 - 18:35

‘స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ’ - స్వజనుల్ని హతమార్చి మనం సుఖించగలమా? సుఖించలేం అన్నది అర్జునుడి వివేక జ్ఞానం. అయితే కురుక్షేత్రంలో ‘సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ’ - కౌరవ పాండవ సేనల నడుమ కృష్ణుడు రథాన్ని నిలిపిన తర్వాత, పాండవ మధ్యముడైన అర్జునుడు ఇరు సేనలను కలయచూసిన తర్వాత కలిగిన మనో వికార ఫలితం విషాదయోగం. అందుకే ‘న కాంక్షే విజయం.. న చ రాజ్య సుఖాని చ’ అన్న వివేక యోగం కలిగింది.

12/19/2015 - 18:33

వసు చరిత్రలో ప్రవరుడికి కొండలలో తిరుగుతూ ఉంటే ఆడమనిషి వాసన తగిలిందట! అదెట్లాగో నాకు అర్థం కాలేదు. ఒకానొక సినిమా పేరు సెంట్ ఆఫ్ ఎ వుమెన్! ఆశ్చర్యమేమంటే ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ అంతకన్నాలేదు. ఒక గుడ్డి ముసలతను, ఒక కుర్రవాడు కథను ముందుకు నడిపిస్తారు.

12/19/2015 - 18:32

కాచిగూడ స్టేషన్లో బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ కదలటానికి సిద్ధంగా ఉంది.

12/19/2015 - 18:31

వి.వి.రామ్ (గుంతకల్లు)
ప్రశ్న: గ్రంథకర్త అగుటకు కావలసిన గ్రహసంపత్తి ఏమిటి?

12/19/2015 - 18:30

సండే గీత

12/19/2015 - 18:53

పుష్యమీ సాగర్, హైదరాబాద్
సాధారణంగా ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసులలో ఎమ్మెల్యే, ఎం.పీ సీటు కేటాయిస్తారు కదా. నిజంగా మన ప్రజా ప్రతినిధులు సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణం చెయ్యగలరా... కనీసం అప్పుడైనా ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు తెలుస్తాయి కదా... మరి వాళ్లు మన బస్సులలో ప్రయాణం చెయ్యనప్పుడు ఆ కోటా ఎందుకండీ?
వాళ్లకు కావలసిన వాళ్లని ఆ సీట్లలో కూచోబెట్టించేందుకు.

12/19/2015 - 18:28

గేదెల గోవిందుకు కష్టకాలం దాపురించింది. వర్షాభావం వల్ల రైతులు పొలాలు దున్నించి పంటలు వెయ్యడం లేదు. గోవిందు సిద్దాపురం అనే ఊళ్లో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. అతనికి స్థిరమైన ఆదాయం లేదని ఎవరూ పిల్లనివ్వడంలేదు.
‘ఎకరం పొలం కూడా లేనివాడివి. పెళ్లాం పిల్లల్ని ఎట్లా పోషిస్తావు? కూలి పనులు సంవత్సరం పొడుగునా వుండవు కదా?’ అంటున్నారు.

12/19/2015 - 18:27

మనకు చాలా మంచి మిత్రులు ఉంటారు. కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉంటే మరి కొంతమందికి మందు ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏవో ఏవో ఇష్టాలు ఉంటాయి.

Pages