కరీంనగర్

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో హరితరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలన్నీ సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ప్రతీ ఇంటింటా మొక్కలు నాటేందుకు జిల్లా పంచాయతీ అధికారి ద్వారా 25 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. వాటిని గ్రామాలలో హరిత రక్షణ కమిటీలు, స్వశక్తి సంఘం మహిళలు మొక్కలు పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ 25 లక్షల పండ్లు, పూలకు సంబంధించిన మొక్కలను మాత్రమే సరఫరా చేస్తున్నామని, ఇందులో మామిడి, సపోట, ఇతర మొక్కలు కలవని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, సంస్థల ఖాళీ స్థలాలలో విరివిగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా కాకతీయ కాలువలు, చెరువుల కట్టల వెంబడి 55 లక్షల ఈతచెట్లు నాటుటకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ, పిజి, సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు కాలేజీల్లో 3.5 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ ద్వారా లక్ష మొక్కలు, పంచాయతీరాజ్ ద్వారా ఆరు లక్షలు, రైల్వే లైన్ వెంబడి లక్ష, ఉద్యానవన శాఖ ద్వారా మూడు లక్షలు, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా లక్ష, మైనర్ ఇరిగేషన్ ద్వారా పది లక్షలు, మేజర్ ఇరిగేషన్ ద్వారా రెండు లక్షలు, అటవీశాఖ ద్వారా రెండు లక్షలు, వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ఐదు లక్షలు, కెడిసిసి ద్వారా లక్ష, శాతవాహన యూనివర్శిటీ ద్వారా మూడు లక్షలు, డిఆర్‌డిఎ ద్వారా 80 లక్షలు, ఇతర శాఖల ద్వారా మొత్తం జిల్లాలో 1.26కోట్ల మొక్కలు నాటుటకు అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించామని కలెక్టర్ తెలిపారు. నిర్ధేశించిన లక్ష్యాలకు మించి హరితహారంలో వచ్చే రెండు నెలల్లో జిల్లాలో విరివిగా మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. మొక్కల నిర్వహణకు సంబంధించిన అంచనాలను ఉపాధిహామీ కింద తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్ ఖానమ్, హరితహారం స్పెషల్ ఆఫీసర్ ఆంజనేయులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, జిల్లా విద్యాధికారి రాజీవ్, వయోజన విద్య ఉపసంచాలకులు జయశంకర్, ఆర్‌డిఓ రాజాగౌడ్, జిల్లా సంక్షేమాధికారి శారద తదితరులు పాల్గొన్నారు.