ఆంధ్ర గాథాలహరి

చెలీ! నీ చేయి నొచ్ నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఎక్కడం పహరువ్విణ్ణం హత్థం ముహమారు ఏణవీ అంతో
సోవి హసంతి ఏ మఏ గహిఓ బిఏణ కంఠమ్మి (పృధ్వి)
సంస్కృత ఛాయ
ఏకంప్రహరోద్విగ్నం హస్తం ముఖమారుతేన వీజయన్
సో పి హసంత్యా మయాగృహీతో ద్వితీయేన కంఠే
తెలుగు
తే.గీ ప్రణయ కలహాన నొక చేతవాని గొట్ట
‘నొచ్చెనా!యని నా చేతి నూదుచుండ
డెందమానంద సందోహమంద, వాని
కౌగిలించితి నవ్వుచు గళము పట్టి
-ప్రణయ కలహంలో ప్రేయసి ప్రియుణ్ణి ఒక చేత్తో గట్టిగా కొట్టింది. అంత అతడు ‘‘చెలీ! నీ చేయి నొచ్చిందా!’’ అంటూ నోటితో ఊదసాగాడు. ఆమె మనసు కరిగింది. ప్రియుణ్ణి మనసారా మరొక చేత్తో మెడపట్టి కౌగిలించుకుంది.
(ఇది చదువుతూంటే నంది తిమ్మన పారిజాతాపహరణంలోని ‘నను భవదీయదాసుని..’ పద్యం గుర్తుకురావడం లేదూ!)

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949