ఆంధ్ర గాథాలహరి

పదునెక్కిన ఎర్రదనం--32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
జో తీపం అహరరా ఓ రత్తిం అవ్వాసిఓ పి అఅమేణ!
సో వ్విఅ దీస ఇగోసే సవత్తిణ అణేసు సంకంతో!!
సంస్కృత ఛాయ
యస్తస్యా అధరరాగో రాత్రా వుద్వా సితః ప్రియతమేన
స ఏవ దృశ్యతే ప్రాతః సపత్నీ నయనేషు సంక్రాంతః
తెలుగు
ఆ.వె
పల్లవాధరములు తెల్లనైపోయెను
రేయి గడచుసరికి, ప్రియునివలన
ఆ అరుణిమ లెల్ల, అతివ సపత్నుల
క్రోధభరిత నయన గుహల జేరె
బహుపత్నీవ్రతుడైన నాయకుడు ప్రేయసితో రాత్రంతా గడిపాడు.
ఆమె పెదవులు ఎర్రదనం కోల్పోయి తెల్లగా అయినాయి. ఆమె పెదవుల ఎర్రదనం, సపత్నుల రోషప్రపూరితములై గుంటలు పడ్డ కన్నులలో తెల్లవారేసరికి ప్రతిఫలించిందట. అంటే ఆమెపై వారు అంతగా ఈర్ష్యపడ్డారన్నమాట.
వివరణ: గాథాసప్తశతిలోని ఈ ‘్ధ్వని’ తరువాతి కాలంలో శ్రీనాథుని శృంగార నైషధ కావ్యంలో నలుని పరాక్రమా న్ని వర్ణిస్తూ ‘అతివర్షము లాశ్రయంచె తత్పరనాథ యూధ వనితా జనతా నయనోత్పలంబులున్ ’ అన్నాడు. అంటే నలుని రాజ్యంలో అతివృష్టిలేదట. అది వెళ్లి శత్రురాజుల భార్యల కళ్లల్లో నెలకొందట. ఎంత లోతైన వూహనో కదా. నలుగు ఎంతోమంది శత్రు రాజలనునిర్జించాడని ఇక్కడి ‘్ధ్వని’ .
ఈర్ష్యను కూడా ఇంత మనోహరంగా చెప్పే కవులుండేవారు. ఈనాడు కేవలం తరగతి విద్యను కంఠతా పట్టడంలో సృజనకు అవకాశము లేకుండా పోతోంది. పిల్లలు వారికిష్టమొచ్చినట్టు చదువుకోనిస్తే ఎంత పదునైన సృజనను వెలార్చుతారో! మార్కులను బట్టి కాక వారిలోన్న సృజనాత్మకతను బట్టి వారిని ప్రశంసిస్తే ఎంత బాగుండు!

--ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949