ఆంధ్ర గాథాలహరి

కష్టమే గదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ణవ వహు పేమ్మ తణు ఇఓ పణఅం పఢమఘరిణీ అరక్ఖంతో
ఆ లిహ అదుప్పరిల్లంపి ణేఇ రణ్ణం థణుం వాహూ!!
సంస్కృతఛ్ఛాయ
నవ వధూ ప్రేమతనూకృతః ప్రణయం ప్రథమం గృహిణ్యారక్షన్
తనూ కృత దురాకర్ష మపి నయత్య రణ్యం ధనుర్వ్యాధః
తెలుగు
తే.గీ
క్రొత్త పెండ్లాము మోజులో కూరుకొనియు
వేట మరచియు, నిదురించు భిల్లుడొకడు
భుజముపై విల్లుగ్రిరివోలె మోసికొనుచు
వెడలుచుండె భారంబుగా వేటకొరకు
కొత్త పెళ్ళాం మోజులో పడి వేటకు వెళ్ళడం లేదొక వేటగాడు. తల్లిదండ్రులు మందలించడంతో గత్యంతరం లేక తేలికైన విల్లును కూడా ఏదో పెద్ద కొండను మోస్తున్నట్లుగా మోసుకుంటూ భారంగా వెళుతున్నాడట ఆ వేటగాడు. నిజమేకదా ఇష్టం లేని పని కష్టంగా ఉంటుందనే సామెత కూడా ఉందికదా. కొత్తపెండ్లాము మోజులో ఉన్నవారికి వృత్తి కూడా ప్రతిబంధకంగా తయారవు తుంది. వృత్తి లేకుంటే భుక్తి లేదు. భుక్తి ఉంటేనే రక్తి, ముక్తి కలుగుతుంది. వృత్తినీ, సంసారాన్ని సమన్వ యం చేసుకొని ముందుకు సాగాలనే పెద్దలు చెప్పే ప్రబోధాన్ని కొత్తలో కష్టంగా అనిపించినా విని ఆచరిస్తే అదే అలవాటై నిజం తెలిసి మనిషి కర్తవ్యాన్ని నిర్వహిం చడంలో కాస్త ఆలస్యం పూర్తిగా చేస్తాడు. పరుగెత్తి పాలు తాగే కన్నా నిదానంగా అమృతం వంటి ఫలాన్ని తేగల శక్తి యువతకు ఉంటుంది. దాన్ని పెడదారి పట్టించకుండా సక్రమమైన దారిలో నడిపించే నైపుణ్యం పెద్దలకు ఉండాలీ, పిల్లలకు పెద్దల మాట సద్దిఅన్నపు మూట అన్న నమ్మకం తెచ్చుకోవాలి. అపుడు ఇద్దరూ ఆనంద చిత్తులు అవుతారు.
*
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949