ఆంధ్ర గాథాలహరి

దుష్టబుద్ధి--39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం

వసఇ జహిం చేఱ ఖలో పోసిజ్జంతో సిణేహదాణేహిం!
తం చేఅ ఆల అం దీఅఓ వ్వ అఇరేణ మఇలేఇ!! (కీర్తిరాజు)
సంస్కృతచ్ఛాయ
వసతి యత్రైవఖః పోష్యమాణః స్నేహాదానైః
తమేవాలయం దీపక ఇవా చిరేణ మలినయతి!!
తెలుగు
ఆ.వె
ఇంట నూనె ద్రావి, ఇచ్చు వెలల్లులెగాక
పొగలనింపు దీపపుం తెరగున
పంచ భక్ష్య తతుల, పరవశుడౌగాక!
చెడ్డ అతిథి విడడు, చెడు తలంపు!
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టటమంటారే! అలాంటి విషయానే్న ఈ గాథలో చెపుతున్నాడు. ఆతిథ్యం ఇచ్చిన వాడి ఇల్లాలినే అతిథి అదోరకంగా చూచాడట. దీపం ఇంటిలోని నూనెతోనే వెలుగుతూ కూడా ఇంటినిండా పొగలు నింపినట్లు, దుష్టుడైన అతిథిని ఎంత బాగా చూచినా, అతడు తన దుష్టబుద్ధిని మాత్రం విడనాడలేడు- అనేదే ఈ గాథ సారాంశం.

--ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949